కేజీయఫ్ చాప్టర్ 1 హిట్ అయినప్పుడు అందరూ బాగా ఫోకస్ అయ్యారు. హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇతర విలన్లు.. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఫోకస్ అయినా ఎందుకో కాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. వాస్తవానికి ఫస్ట్ పార్ట్‌లో ఆమె ఉన్నా ఎందుకో హైలెట్ కాలేదు. అయితే ఇప్పుడు కేజీయఫ్ 2 రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా ఊపేస్తోంది. ఇటు ఏపీ, తెలంగాణలో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. నైజాంలో ఫస్ట్ వీకెండ్‌కే రు. 30 కోట్ల షేర్. ఓ డబ్బింగ్ సినిమా వసూళ్లేనా ? అని అందరూ నోరెళ్లబెడుతున్నారు.
అటు నార్త్‌లో హిందీ వసూళ్లే ఇప్పటకి రు. 220 కోట్లకు చేరుకున్నాయి. ఎవ్వరి నోటా కేజీయఫ్ ప్రభంజనం చూసి మాట రావడం లేదు. ఇక పార్ట్ 2లో హీరోయిన్ శ్రీనిధికి మంచి రోల్ ఉంది. ఆమె చెప్పిన మదర్ డైలాగ్ ఎంతో సెంటిమెంట్ పడించింది. ఇక ఇప్పుడు ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ శ్రీ నిధి గురించి స్టార్ డైరెక్టర్లు, బ్యానర్లు ఆరాలు తీస్తున్నారు.
కేజీయఫ్ హీరోయిన్ అన్న ట్యాగ్ వచ్చేసింది. దీంతో ఆమెను ఎలాగైనా తమ సినిమాలో పెట్టుకోవాలని పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసేది కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తోనే.
ప్రశాంత్ నీల్ వల్లే శ్రీనిధికి ఇంత లైఫ్ వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్‌తో చేస్తోన్న సలార్‌లో శృతీహాసన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్‌తో చేసే సినిమాలో మరోసారి తనకు కలిసొచ్చిన శ్రీనిధినే తీసుకోవాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కేజీయఫ్‌తో ఆమె పాన్ ఇండియా లెవల్లో సినీ అభిమానుల మదిలో స్ట్రైక్ అయిపోయింది.
రేపు ఎన్టీఆర్ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లోనే తీసే ప్లాన్ జరుగుతోంది. అందుకే మరోసారి అదే హీరోయిన్ను తీసుకుంటే ఎడ్వాంటేజ్ ఉంటుందని.. ఎన్టీఆర్ సినిమా గురించి నీల్ ఇప్పటికే శ్రీనిధితో చెప్పాశాడనే అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో విక్రమ్ నటిస్తోన్న కోబ్రా మాత్రమే ఉంది. కన్నడ హీరోయిన్లు తెలుగులో ఎలా రాజ్యం ఏలేవారో నిధికి తెలియంది కాదు.
అనుష్క, ఇప్పుడు రష్మిక రేపు శ్రీ నిధి కూడా కాస్త జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటే కన్నడ కంటే తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఆమె ఓకే చెప్పడం వెనక కూడా ఇదే ప్లాన్ ఉందని అంటున్నారు.