అబ్బో ఇటీవల ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో పాపులర్ అవ్వాలంటే వర్థమాన హీరోల కంటే హీరోయిన్లే ముందు ఉంటున్నారు. హీరోలు ఫేమ్‌లోకి రావాలంటే ఎంతో కష్టపడాలి.. వాళ్లకు డైరెక్టుగా హీరోలు అవ్వరు.. మీడియా అటెన్షన్లో ఉండరు. పేరున్న దర్శకులు, నిర్మాతలు కూడా వాళ్లను దగ్గరకు రానివ్వరు. అదే హీరోయిన్లు బోల్డ్ షూట్లు, బికినీలు వేసుకుని బోల్డ్ కామెంట్లు చేస్తే చాలు ఎవ్వరి దృష్టిలో అయినా చిటుక్కున పడిపోతూ ఉంటారు.
ఇలా తక్కువ టైంలోనే పాపులర్ అవ్వడంతో పాటు సోషల్ మీడియా అటెన్షన్లో పడింది శ్రీ రాపాక. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన న్యాక్డ్ మూవీలో హీరోయిన్గా నటించిన ఈ గోదారి చిన్నది ఆ సినిమాలో బోల్డ్ సీన్లలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అబ్బా ఒక్కో సీన్.. ఒక్కో షాట్లో కుర్రకారును బాగా హీటెక్కించేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఆమెకు రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. దీనికి తోడు బాలయ్య సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా చేయడం.. బాలయ్య గురించి ఇంటర్వ్యూల్లో కామెంట్లు చేయడంతో వార్తల్లో ఉంటూనే వస్తోంది.
ఈ అమ్మడు ఇటీవల బిగ్‌బాస్ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఏదో ఒక సంచలన విషయంతో వార్తల్లో ఉండేందుకే ఇష్టపడుతోన్న ఆమె తాజాగా ప్రభాస్ పెళ్లికి, తన పెళ్లికి లింక్ పెడుతూ చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు ఇష్టమైన హీరో ప్రభాస్ అని.. ప్రభాస్ సినిమాలో ఒక్క ఛాన్స్ వచ్చినా తన జన్మ ధన్యమైపోయినట్టే అని చెప్పింది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ ? అని అడిగితే.. ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాసే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. అప్పుడే తన పెళ్లికి కంగారేం లేదు అని చెప్పింది.
శ్రీ రాపాక మాటలు చూస్తుంటే ప్రభాస్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నట్టుగానే ఉంది. అందుకే ఈ అమ్మడు ప్రభాస్ పెళ్లికి, తన పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడుతోంది. మరి ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ? అప్పటి వరకు శ్రీ రాపాక కూడా ఇలా ముదురు బ్యాచిలర్‌గానే ఉండిపోతుందా ? అన్నది చూడాలి. ఏదేమైనా ఆర్జీవీ దెబ్బకు శ్రీ రాపాక ఎక్కడో ఉండాల్సింది.. ఎక్కడికో వెళ్లిపోయింది.