ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల వరుసగా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెపుతూ బాగా వైరల్ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య – సమంత జంట ముందే విడాకులు తీసుకోబోతోందంటూ ఆయన చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత వారు నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో నిజానిజాలు ఎలా ఉన్నా ? వేణుస్వామి చేసే కామెంట్లు, ఆయన చెప్పే జాతకాలపై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి అయితే ఉంది.
తాజాగా వేణుస్వామి స్టార్ డైరెక్టర్ రాజమౌళి జాతకంపై చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియా సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రాజమౌళితో చేసిన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికే రు. 1100 కోట్ల గ్రాస్ వసూళ్ల జాబితాలోకి చేరిపోయింది. త్వరలోనే రాజమౌళి మహేష్‌బాబు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అదిరిపోయే అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక రాజమౌళి జాతకాలను పెద్దగా నమ్మడు. ఆయన ఎప్పుడో కాని గుళ్లు, గోపురాలకు కూడా వెళ్లరు. అయితే రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడని.. ఆయన సినిమా ప్రమోషన్లు మాత్రం ఎవ్వరూ చేయనంతగా చేస్తారని వేణుస్వామి తెలిపారు. రాజమౌళి 10 పైసల సినిమా చేస్తే.. 100 పైసల పబ్లిసిటీ చేసుకుంటారని.. సినిమా ఫలితం కూడా పాజిటివ్‌గానే వస్తుందని వేణుస్వామి చెప్పారు. ఈ విషయం నార్త్ ఇండియన్స్ బాగా చెపుతారని కూడా ఆయన అన్నారు.
త్రిబుల్ ఆర్ సినిమా గురించి కూడా మాట్లాడిన వేణుస్వామి ఈ సినిమాలో అలియాభట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిందని.. అలియా అసలు సినిమాలో హీరోయిన్ క్యారెక్టరే కాదని కూడా ఆయన బాంబు పేల్చారు. సినిమా మొత్తం మీద ఆమె మూడు సార్లు మాత్రమే కనిపిస్తుందని.. అయితే ఆమె 33 ప్రెస్మీట్లకు వచ్చిందని వేణుస్వామి వెల్లడించారు. ఇదే సినిమా మరో డైరెక్టర్ తీసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కూడా ఆయన చెప్పారు.
రాజమౌళిది కుంభం కావడంతో ఆయన డైరెక్షన్లో నటించిన హీరోలు తర్వాత సినిమాలు అన్ని డిజాస్టర్లే అవుతుంటాయని… ఆయన డైరెక్షన్లో నటించే హీరోలు జ్యోతిష్యం చెక్ చేయించుకోవాలని కూడా ఆయన చెప్పారు. ఇక చరణ్‌కు ఇప్పుడు వచ్చిన ఫేమ్ అంతా రాహువు వల్లే వచ్చిందన్న ఆయన ప్రభాస్, రానాపై కూడా రాజమౌళి ప్రభావం పడిందంటూ.. పరోక్షంగా బాహుబలి తర్వాత ఈ ఇద్దరి హీరోల ప్లాప్ సినిమాల ప్రస్తావన తీసుకువచ్చారు.