టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎప్పుడో రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా కరోనా పాండమిక్ వల్ల ఈ సినిమా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఈ సినిమాను వచ్చే నెల 12న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఒక్క సాంగ్ మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయినట్టు కూడా తెలుస్తోంది. మహేష్‌బాబు వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. భరత్ అనే నేను ఆ తర్వాత మహర్షి.. సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్‌హిట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు. 2020లో సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. దీంతో మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్టు తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమా రైట్స్ ను రు. 30 కోట్లకు అమ్మారు. మామూలుగా అయితే ఇది ఇప్పుడు స్టార్ హీరోలతో పోలిస్తే మీడియం రేంజ్‌లో అమ్మినట్టు అనుకోవాలి. ఆచార్య లాంటి సినిమాలను రు. 40 కోట్ల పై రేషియలో అమ్మారు. నైజాంలో ఇప్పుడు బాలయ్య అఖండ లాంటి సినిమాలకు రు. 25 కోట్లు సులువుగా వస్తున్నాయి.
మీడియం రేంజ్ హీరోల సినిమాలే హిట్ అయితే రు. 20 కోట్లు సులువుగా వస్తున్నాయి. ఇప్పుడు సర్కారు వారి పాటను రు. 30 కోట్ల రేంజ్‌లో అమ్మారు. ఇక ఏపీలో ఈ సినిమా రైట్స్ ఓవరాల్‌గా రు. 50 కోట్ల రేంజ్‌లో అమ్ముడు పోయాయి. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా టార్గెట్ రు. 80 కోట్లు.. దీనికి కర్నాకట, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్ అదనం కానుంది.