సౌత్ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్లు సమంత, నయనతార. ఈ ఇద్దరు హీరోయిన్లు దాదాపుగా పదేళ్లుగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. సమంత టాలీవుడ్ హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని విడాకులు కూడా ఇచ్చేశాడు. ఇక నయనతార తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారన్న వార్తలు కూడా వస్తున్ననాయి. ఇదిలా ఉంటే తన లవర్ విశ్నేష్‌ను ఏదోలా డైరెక్టర్‌గా సెటిల్ చేసేందుకు నయన్ కొద్ది రోజులుగా తాపత్రయ పడుతూనే ఉంది.
ఈ క్రమంలోనే తామే సొంతంగా కేఆర్‌కే సినిమా తీశారు. నయనతారతో పాటు మరో హీరోయిన్‌గా సమంత, అటు విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరో కాంబోలో విఘ్నేష్ డైరెక్షన్‌లో ఈ కేఆర్‌కే సినిమా తెరకెక్కింది. ఇంత భారీ కాస్టింగ్, ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఉన్నా కూడా సినిమాపై ముందు నుంచే అంచనాలు లేవు. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు మరీ పూర్ టాక్ వచ్చింది.
తాను ఏ పని చేపట్టినా అది పాడైపోవడం తప్పా మంచన్నదే జరగని హీరో పగలు ఓ జాబ్‌లో, రాత్రి మరో జాబ్‌లో జాయిన్ అవుతాడు. అక్కడే నయనతార, సమంతతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమలో పడతాడు. చివరకు రాంబో లైఫ్‌లో ఏం జరిగిందన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమా మెరుపులు ట్రైలర్ వరకే పరిమితం.. సినిమాతో పోలిస్తే ట్రైలర్ చాలా బెటర్ అనిపించింది. సినిమా పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా మారింది.
దర్శకుడు విఘ్నేష్ కథను చెప్పడంలో పదే పదే తడబడ్డాడు. అసలు ఒకే హీరో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమలో పడినప్పుడు చాలా ఇంట్రస్టింగ్గా స్టోరీ ఉంటుంది. దర్శకుడు మైండ్‌లో బోలెడంత కన్‌ఫ్యూజ్‌తో కథను గందరగోళం చేసి పడేశాడు. ఇలా ఇద్దరు హీరోయిన్లతో ప్రేమలో పడడం ఏ మాత్రం కొత్తగా లేదు. కథలో ప్రేమ, రొమాన్స్ అన్నీ నీరసంగానే కనిపిస్తాయి.
విజయ్ సేతుపతి లాంటి టాలెంట్ ఉన్న నటుడిని తమిళ దర్శకులు ఇంత చీప్ పాత్రలకు ఎందుకు వాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. పుష్ప సినిమాలో విలన్ పాత్ర చేయమని అడిగితే విజయ్ చేయనని చెప్పి మరీ ఈ సినిమా చేశాడు. పైగా సౌత్ ఇండియాను ఊపేస్తోన్న ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఉండి కూడా సినిమాను పాస్ చేయలేక అందరూ కలిసి చేతులు కాల్చుకున్నారు. అసలు ఈ కథే పరమ చెత్త కథ అనుకుంటే విఘ్నేష్ బోరింగ్ ట్రీట్‌మెంట్‌తో సినిమా చూసే వాళ్లకు డబుల్ టార్చర్ పెట్టాడు.