సినిమాల్లో సీన్ తాము అనుకున్నట్టుగా పండాలంటే దర్శకులు చాలా సాహసాలు, రిస్క్‌లు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్లు చెప్పినట్టు చేసేందుకు హీరోలో లేదా హీరోయిన్లో ఒప్పుకోరు. అయితే వాళ్లు చాలా ట్రిక్స్ ప్లే చేసి తాము అనుకున్న సీన్ అలాగే పండేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు హీరోయిన్లను ఎక్స్పోజింగ్ చేసేందుకు బతిమిలాడుకోవడం నుంచి మొదలు పెట్టి చాలా టెక్నిక్స్ ప్లే చేసేవారట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇక మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ – సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో తెలిసిందే. అసలు ఈ సినిమాతోనే చరణ్ బెస్ట్ నటుడిగా తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో చెవిటి వాడి క్యారెక్టర్లో చరన్ తన నట విశ్వరూపం చూపించేశాడు. ఇక రంగస్థలం సినిమాలో చరన్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళుతున్నప్పుడు సమంత ఒక్కసారిగా అతడిని వాటేసుకుని లిప్‌కిస్ ఇస్తుంది.
ఈ లిప్‌కిస్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. స్క్రిఫ్ట్ డిమాండ్ మేరకు సినిమాలో తప్పకుండా లిప్‌కిస్ ఉండాలి. అయితే ఎంత చెప్పినా కూడా చరన్ వద్దన్నాడు. అస్సలు వినడం లేదట. సీన్ పండాలంటే లిప్ కిస్ ఉండాలని చెప్పినా నో చెప్పేశాడట. తన భార్య ఉపాసనకు అవన్నీ నచ్చవని చెప్పేశాడట. పోనీ గ్రాఫిక్స్‌తో మేనేజ్ చేద్దామని అనుకున్నా.. ఆ సీన్ నేచురల్‌గానే పండాలి.. లేకపోతే వేస్ట్. చివరకు లాభం లేదనుకున్న సుకుమార్ అరెస్టు చేసేటప్పుడు స్పీడ్‌గా వెళ్లి చరన్‌కు లిప్‌కిస్ ఇచ్చేయమని చెప్పాడట. సమంత అలాగే చేసింది.
అయితే సమంత లిప్‌కిస్ పెడుతుందన్న విషయం చరన్‌కు చెప్పలేదు. ఈ లిప్ కిస్ చేసేందుకు సమంత ఒప్పుకుంది. సీన్ అయిపోయాక షాక్ అయిన చరణ్ సుకుమార్‌ను ప్రశ్నించడంతో పాటు సీరియస్ అయ్యాడట. చివరకు సుకుమార్ – సమంత సర్దిచెప్పడంతో చరన్ ఎట్టకేలకు ఓకే చేశాడు. అలా చరన్‌ను మోసం చేసి చివరకు లిప్ కిస్ ఓకే చేశారు. అయితే ఆసీన్ థియేటర్లలో మాత్రం ఓ రేంజ్లో పండింది.