టాలీవుడ్ స్టార్ హీరొయిన్ సమంత..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే.. మరో వైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ..తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది. పెళ్లికి ముందు ..తరువాత సమంత ఎలా ఉన్నా..డైవర్స్ తరువాత మాత్రం ఫుల్ జోష్ మీద సినిమాలకు సైన్ చేస్తూ.. మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది.
ఆమె నటించిన మూడు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా..వాటి ప్రమోషన్స్ లో సామ్ బిజీ బిజీ గా ఉంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాని వదలని సమంత.. తాజా గా ఇన్స్టా లో ఓ లైవ్ సెషన్ పెట్టింది. Ask Me Anything అంటూ..అభిమానులతో కొంచెం సేపు ముచ్చటించింది. ఈ సెషన్ లో సమంతను అభిమానులు రకరకాల Questions అడిగారు. సమంత వాటి అన్నింటికి ఒపికగా సమాధానాలు ఇస్తూ వచ్చింది.
ఈ క్రమంలొనే సమంతకు ఓ నెటిజన్ వింత Question వేశాడు. కొన్ని టాటూల్ని మీరు ఏదో ఒకరోజు ప్రేమిస్తారు కదా సమంత అని ఓ అభిమాని అడగ్గా..ఆ ప్రశ్నకు సమంత స్మైల్ తోనే స్పష్టంగా సమాధానమిచ్చింది. సామ్ మాట్లాదుతూ..”ఈ సంధర్భంగా నేను ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నా..జీవితంలో ఎప్పుడూ..ఎవ్వరు కూడా టాటూ ని మాత్రం వేసుకోవద్దు.. ఎప్పటికీ వేసుకోద్దని” స్పష్టం చేసింది. మనకు తెలిసిందే సమంత ఒంటిపై టోటల్ మూడు టాటూలున్నాయి.
ఒకటి సమంత మెడ కింద .. రెండవది ఆమె కుడివైపు రిబ్స్పై ..మూడవది చాలా చాలా స్పెషల్ సమంత, నాగ చైతన్యలిద్దరూ మోచేతిపై రెండు బాణాలు గుర్తులు వేసుకున్నారు. సమంత చై తో విడిపోయిన తరువాత కూడా ఆ టాటూలను తమ ప్రేమకు గుర్తుగా ఉంచుకున్నారు.