Moviesబాల‌య్య కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం... ప్లాప్‌తో షాక్ ఇచ్చిన ప్రేక్ష‌కులు...!

బాల‌య్య కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం… ప్లాప్‌తో షాక్ ఇచ్చిన ప్రేక్ష‌కులు…!

సీనియర్ ఎన్టీయార్ తెలుగు చలన చిత్ర సీమను మూడున్నర దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజులా ఏలారు. ఆయన పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు. రాజు అంటే ఆయనే, రాముడు క్రిష్ణుడు కూడా ఆయనే. అంతే కాదు, రావణుడు, కీచకుడు అయినా ఆయనే. ఇలా ఎన్టీయార్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు ఎప్పటికీ వర్ధమాన నటులకు ఒక అద్భుతమైన పాఠమే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఎన్టీయార్ తాను తగ్గి తనయుడు బాలయ్యను స్టార్ గా చేయాలని చాలానే ఆలోచించారు. ఆ క్రమంలో ఆయన 1978లో సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా అక్బర్ సలీం అనార్కలి. ఈ మూవీలో అంతా బాలయ్యను ఎలివేట్ చేస్తూ ఎన్టీయార్ తాను పక్కన ఉండే పాత్రలో నటిస్తారు.
ఈ సినిమాలో వయసు మళ్ళిన అక్బర్ గా ఎన్టీయార్ కనిపించి అప్పటికీ తన మీద మోజు పెంచుకున్న అభిమానులను నిరాశపరచారు. అయితే ఆయన ఆలోచన అంతా కొడుకు బాలయ్యను స్టార్ హీరో చేయాలనే. దానికి ఆయన మంచి టెక్నికల్ టీమ్ ని కూడా సెట్ చేసుకున్నాడు.

ఆ టీమ్ లో ముంబైలో ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఉన్న సీ రామచంద్రని అక్బర్ సలీం అనార్కలీకి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అదే విధంగా నాటి గ్లామర్ బ్యూటీ దీపను బాలయ్యకు జోడీగా అనార్కలీగా నటింపచేసారు. బాలయ్యకు ప్లే బ్యాక్ పాడేందుకు బాలీవుడ్ లోని అధ్బుత గాయకుడు మహమ్మద్ రఫీని తెచ్చారు. ఇక ప్రఖ్యాత రచయితే డాక్టర్ సి నారాయణరెడ్డితో పాటలతో పాటు సినిమాకు మాటలు రాయించి కొత్త ప్రయోగం చేశారు. సినిమాటోగ్రఫీ సహా అన్నీ కూడా పెర్ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక ఈ సినిమాలో పాటలు ఈ రోజుకూ మారుమోగుతాయి. ముఖ్యంగా సిపాయీ ఓ సిపాయీ సాంగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే బాలయ్యకే మొత్తం పాటలు పెట్టారు, సినిమా ఖర్చుకు కూడా వెనకాడకుండా తీశారు. బాలయ్య కూడా పెర్ఫార్మెన్స్ బాగానే చేశారు. తండ్రి అక్బర్ తో ఆయన పోరాడిన తీరు కూడా సూపర్ అనేలా ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఇన్ని హంగులు ఉన్నా జనాలకు మాత్రం ఎక్కలేదు. అక్బర్ సలీం మీద కధ అంటే ఉత్సుకత ఉన్నా ఇక్కడ తండ్రి కొడుకుకు విలన్ గా మారడం, అది కూడా నాడు నంబర్ వన్ హీరో ఎన్టీయార్ ఆ పాత్ర పోషించడంతో జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు అనుకోవాలి.

మొత్తానికి ఎన్నో అంచనాలతో 1978 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ చివరికి ఫ్లాప్ అయింది. ఈ సినిమా కనుక హిట్ అయి ఉంటే బాలయ్య నాడే స్టార్ హీరో స్టాటస్ సంపాదించేవాడు. ఆ తరువాత ఆయన పూర్తి స్థాయి సోలో హీరోగా కూడా వెంటనే సినిమాలు మొదలయ్యేవి. కానీ ఎందుకో ఈ సినిమా తేడా కొట్టేసింది. ఎన్టీయార్ ఆశలను కూడా వమ్ము చేసింది. ఒక విధంగా నందమూరి అభిమానులను కూడా నిరాశపరచిన సినిమాగా దీన్ని చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news