మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ RRR. ఈ లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినిమా అభిమానులు అందరూ ఏకంగా మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రు. 800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
కరోనా తర్వాత ఈ స్థాయిలో విజయం సాధించిన భారతీయ సినిమా ఏదీ లేదు. మహా మహా బాలీవుడ్ సినిమాలకే రు. 200 కోట్ల వసూళ్లు రావడం గగనమవుతోంటే త్రిబుల్ ఆర్ ఇప్పటికే ఏకంగా రు. 800 కోట్ల వసూళ్లు రాబట్టింది. పది రోజులకే ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ త్రిబుల్ ఆర్ లాంగ్ రన్‌లో ఎన్ని వసూళ్లు సాధిస్తుందో ? చూడాలి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంచలన విజయాలు, రికార్డులు నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు నైజాం ఏరియాలో అయితే ఎప్పటకీ చెరగపోని చరిత్ర క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోందా ? అనిపిస్తోంది. అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సినిమా రు. 100 కోట్ల షేర్ రాబడితేనే పెద్ద గోప్ప హిట్ అన్నట్టు లెక్క. అలాంటిది ఒక్క నైజాంలో మాత్రమే అది.. కూడా రెండు వారాలు కూడా పూర్తి కాకుండానే రు. 100 కోట్ల షేర్‌కు త్రిబుల్ ఆర్ అతి చేరువలో ఉంది.
11వ రోజు రు. 2 కోట్లకి పైగా షేర్ రాబట్టి 99.2 కోట్ల మేర మార్క్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. 12వ రోజుతో రు. 100 కోట్లు క్రాస్ చేసినట్టే అవుతుంది. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు రు. 70 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు రాజుకు రు. 30 కోట్లకు పైగా లాభం వచ్చేలా ఉంది. మరో రు. 10 కోట్లు వస్తే లాభం మరింత పెరుగుతుంది. అందుకే రాజు త్రిబుల్ ఆర్ టీంకు అదిరిపోయే పార్టీ కూడా ఇచ్చారు.