మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ చిత్రం RRR. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఇండస్ట్రీ జనాలు మూడేళ్లుగా ఎంతలా వెయిట్ చేశారో చూశాం. గత నెల 25న రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రు.1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణలో రు. 250 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా.. ఒక్క నైజాంలోనే ఏకంగా రు. 110 కోట్లు కొల్లగొట్టింది.
రూ. 110 కోట్ల వసూళ్లు రాబట్టిన త్రిబుల్ ఆర్ నైజాంలో ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్ వసూళ్లా అని ట్రేడ్ వర్గాలు సైతం దిమ్మతిరిగిపోయేలా చేసింది. ఈ సినిమా నైజాం రైట్స్‌ను దిల్ రాజు రు. 70 కోట్లకు కొన్నారు. ఇప్పుడు ఏకంగా రు. 40 కోట్లకు పైగా లాభాలు అక్కడ వచ్చాయి. సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటుతున్నా ఇప్పటకీ నైజాంలో త్రిబుల్ ఆర్‌కు చెప్పుకోదగ్గ షేర్ వస్తోంది.
అయితే ఈ సినిమా హైదరాబాద్ సిటీలో రేర్ ఫీట్ నమోదు చేసింది. అసలు ఇది కని వినీ ఎరుగని రేంజ్ రికార్డ్ అని చెప్పాలి. హైదరాబాద్ సిటీలో ఏకంగా 46 సెంటర్లలో 1 కోటి చొప్పున వసూళ్లు కొల్లగొట్టింది. ఒక్క గ్రేటర్ సిటీలో 46 సెంటర్లు ( ఏరియాల్లో) ఏకంగా సెంటర్‌కు కోటి చొప్పున వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెర్పామెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో ? అర్థమవుతోంది.
ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఈ సినిమా టీం అంతా తమ నెక్ట్స్ సినిమాలకు రెడీ అవుతోంది. రామ్‌చరణ్ నెల రోజుల గ్యాప్‌లోనే ఈ నెల 29న మరోసారి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆచార్యలో చెర్రీ.. తన తండ్రి చిరంజీవితో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా జూలై నుంచి సెట్స్ మీదకు వెళుతుంది. ఇక రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్‌బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దసరా నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.