దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ త్రిబుల్ ఆర్. ఈ సినిమా అనుకున్నట్టే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర లిఖిస్తూ సరికొత్త వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే రెండు వారాలు కంప్లీట్ చేసుకుంది. త్రిబుల్ ఇప్పటికే మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు వారాల్లో త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రు. 950 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. రు. 500 కోట్ల షేర్ రాబట్టింది.
త్రిబుల్ ఆర్ ఓవర్సీస్ లో 189 కోట్ల గ్రాస్ రాబట్టగా.. దేశీయ వసూళ్ళు 761 కోట్లుగా ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ రు. 520 కోట్లు అంటున్నారు. ఇక ఏపీ తెలంగాణలో ఈ సినిమా రు. 200 కోట్లకు పైగా కలెక్షన్లు ( నెట్) రాబట్టింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రు. 192 కోట్లకు అమ్మారు. అంటే ఏపీ, తెలంగాణ వరకు ఈ సినిమా క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు రు. 100 కోట్లకు పైగా షేర్ వచ్చింది. బాహుబలి 2 రికార్డును త్రిబుల్ ఆర్ కేవలం 10 రోజుల్లోనే బ్రేక్ చేయడం మరో విశేషం.
ఓవరాల్‌గా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రు. 250 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండో వారంలో ఏపీ, తెలంగాణలో రు 61.11 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో వారంలో బాహుబలి 2 పేరిట ఉన్న 40.28 కోట్ల షేర్‌ను బ్రేక్ చేసింది. అయితే తమిళనాడు, కర్నాకట, కేరళలో ఇంకా త్రిబుల్ ఆర్ బ్రేక్ ఈవెన్‌కు రావాల్సి ఉంది. ఈ వారం బీస్ట్, కేజీయఫ్ 2 ఉండడంతో త్రిబుల్ ఆర్ ఏం చేస్తుందో ? చూడాలి.
త్రిబుల్ ఆర్ 14 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 102.85 కోట్లు
సీడెడ్ – 42.40 కోట్లు
ఉత్తరాంధ్ర – 31.96 కోట్లు
నెల్లూరు – 8.50 కోట్లు
గుంటూరు – 16.75 కోట్లు
కృష్ణా – 13.35 కోట్లు
వెస్ట్ – 12.07 కోట్లు
ఈస్ట్ – 14.50 కోట్లు
———————————————————–
ఏపీ + తెలంగాణ = 242.38 కోట్లు (345 కోట్ల గ్రాస్)
————————————————————-
కర్ణాటక – 40 కోట్లు (75 కోట్ల గ్రాస్)
తమిళనాడు – 37.5 కోట్లు (65 కోట్లు గ్రాస్)
కేరళ – 9.8 కోట్లు (24 కోట్ల గ్రాస్)
నార్త్ ఇండియా – 104 కోట్లు (248 కోట్ల గ్రాస్)
ఓవర్సీస్ – 87 కోట్లు (189 కోట్లు)
—————————————————-
వరల్డ్ వైడ్ – 520.68 కోట్లు (950 కోట్ల గ్రాస్)
—————————————————–