టాలీవుడ్‌లో మెగాస్టార్ సినిమా వస్తుందంటే ఇప్పటకీ ఎంత క్రేజ్ ఉంటుందో ఆచార్య ప్రి రిలీజ్ బజ్ నిదర్శనం. చిరు పదేళ్లు సినిమా చేయకపోయినా ఖైదీ నెంబర్ 150.. పైగా అది కూడా కోలీవుడ్ కత్తికి రీమేక్‌లో నటిస్తే రు. 100 కోట్ల షేర్. సైరా ప్లాపే అన్నారు.. ఆ సినిమాకు కూడా రు. 100 కోట్ల షేర్. ఇప్పుడు సైరా వచ్చి కూడా మూడేళ్లు దాటుతోంది. ఆచార్యకు రు. 150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్. ఈ లెక్కలు చాలు చిరు రేంజ్, క్రేజ్ ఏంటో చెప్పేందుకు..!
చిరు తన 152 సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. నాటి తరం రాధిక, మేనకతో మొదలు పెడితే నేటి తరం తమన్నా, కాజల్, నయనతార ఇలా ఆయన కెరీర్‌లో ఎందరి హీరోలతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాడో చెప్పక్కర్లేదు. చిరుతో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఎంతో మంది హీరోయిన్లు లైకింగ్‌తో ఉంటారు. చిరుకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ హీరోకు దక్కని ఓ లక్కీ ఛాన్స్ దక్కింది.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు అక్కాచెల్లెళ్లతో చిరు ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాడు. చిరంజీవి – రాధిక జోడీ అంటే 1980వ దశకంలో తిరుగులేని క్రేజ్ ఉండేది. అప్పట్లో చిరు పక్కన పోటాపోటీగా డ్యాన్సులు వేసి.. డైలాగులు చెప్పడంతో పాటు షూటింగ్‌లో కూడా ఓ మగరాయుడిలా ఉండేదట రాధిక. 1978లో న్యాయం కావాలి సినిమా ద్వారా తొలిసారిగా రాధిక – చిరు జంట కట్టారు. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్ ఎన్నోసార్లు రిపీట్ అయ్యింది.
అభిలాష – గూఢచారి నెంబర్ 1 – యమకింకరుడు – రాజా విక్రమార్క ఇలా ఎన్నో హిట్ సినిమాలు వీరు కలిసి చేశారు. ఆ తర్వాత రాధిక సోదరి అయిన నిరోషతో కూడా చిరు నటించారు. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్లో చిరు – నిరోషా తెర పంచుకున్నారు. 1991లో వచ్చిన ఈ సినిమా యండమూరి నవల ఆధారంగా తెరకెక్కింది. మరో హీరోయిన్‌గా విజయశాంతి నటించారు.
అలాగే మరో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అయిన హీరోయిన్లతో చిరు నటించారు. వారే నగ్మా – రోషిణి – జ్యోతిక. వీరిలో రోషిణి, జ్యోతికకు నగ్మా హాఫ్ సిస్టర్. వీరికి తల్లి ఒకరే. తండ్రులు వేరు. నగ్మా – చిరు కాంబోలో ఘరానా మొగుడు, రిక్షావోడు లాంటి సినిమాలు వచ్చాయి. ఇక రోషిణి చిరుతో మాస్టర్ లాంటి బ్లాక్‌బస్టర్ లో నటించింది. జ్యోతిక ఠాగూర్ సినిమాలో చిరు పక్కన నటించింది. ఇలా ఐదుగురు అక్కాచెల్లెళ్లతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ హీరోగా మెగాస్టార్‌కు ఒక్కడికే ఈ అరుదైన రికార్డ్ ఉంది.