మొత్తానికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కేజీయఫ్ 2కు వరల్డ్ వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. రెండు రోజులకే రు. 300కు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేశాయి. సినిమాకు భాషతో, రాష్ట్రంతో సంబంధం లేకుండా సూపర్ టాక్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో రాకీ భాయ్ పాత్రను చాలా పవర్ ఫుల్‌గా చూపించాడు. అసలు ఈ రేంజ్‌లో ఎలివేషన్లు ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు.
హిందీలో రెండు రోజులకే రు. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమా లాంగ్ రన్లో ఒక్క హిందీలోనే రు. 500 కోట్ల నెట్ వసూళ్లు రాబడుతుందన్న అంచనాలు అప్పుడే వచ్చేశాయి. ఇక ఈ సినిమాలో చాలా పాత్రలను ప్రశాంత్ పవర్ ఫుల్‌గా చూపించాడు. హీరో యశ్, హీరోయిన్ శ్రీ నిధి శెట్టి, ప్రధానమంత్రి రమ్మికా సేన్‌గా రవీనా టాండన్, విలన్ సంజయ్‌దత్ ఇలా చాలా పాత్రలకు మంచి స్క్రీన్ ప్రెజన్సీతో పాటు ప్రాధాన్యం ఉంది.
ఈ క్రమంలోనే ఇనాయత్ ఖలీల్ అనే పాత్ర కూడా సినిమాలో ప్రధాన్యంతో ఉంది. ఈ పాత్రలో నటించిన వ్యక్తి పేరు బాలకృష్ణ. ఈ బాలకృష్ణకు మన టాలీవుడ్‌కు లింక్ ఉంది. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరో పాత్రల్లో నటించడంతో పాటు సైడ్ క్యారెక్టర్లలో నటించిన ఆదర్శ్ బాలకృష్ణన్‌కు స్వయానా తండ్రి కావడం విశేషం. ఈ ఆదర్శ్ బాలకృష్ణన్ తెలుగులో బిగ్‌బాస్ సీజన్ వన్‌లో కూడా ఓ కంటెస్టెంట్‌గా నటించాడు.
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక ఆదర్శ్ బాలకృష్ణన్ మరింత పాపులర్ అయ్యాడు. ఇక కేజీయఫ్ 2లో ఖలీల్ అనే దుబాయ్ డాన్ పాత్రలో బాలకృష్ణ తండ్రి నటించి మెప్పించాడు. డాన్ పాత్రకు బాగా న్యాయం చేశాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు బాలకృష్ణ బంధువు అని.. ఆ బంధుత్వంతోనే ఈ పాత్ర అతడికి దక్కిందని సమాచారం.
ప్రశాంత్ నీల్ స్వస్థలం కర్నాటకలోని హసన్. హసన్‌లో పుట్టి అక్కడే పెరిగిన ప్రశాంత్ ఆ తర్వాత సినిమా రంగంపై ఆసక్తితో బెంగళూరు వచ్చాడు. ముందుగా ఉగ్రం సినిమాతో డైరెక్టర్ అయ్యి.. రెండో సినిమాతోనే దేశవ్యాప్తంగా పెద్ద సంచలనానికి తెరదీశాడు.