రష్మిక..ఓ అల్లరి పిల్ల. చాలా చాలా క్యూట్ గా.. అట్రాక్టీవ్ స్మైల్ తో.. స్టన్నింగ్ లుక్స్ తో..కనిపించే హాట్ బేబీ. ఛల్లో సినిమా చ్హుసిన తరువాత అమ్మడు కి ఈ స్దాయి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని కనీసం ఆమె కూడా అనుకోని ఉండదు. అంత లా క్రేజీ క్రేజీ డీల్స్ పట్టి..స్టార్ హీరో లతో సినిమాలు చేసి..టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. రీసెంట్ గా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్దాయిలో గుర్తింపు పొందిన ఈమె..ప్రస్తుతం అటు కోళీవుడ్, బాలీవుడ్..ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమా అంటే అందరికి గుర్తు వచ్చేది రెండే పేర్లు..ఒకటి పూజా..రెండు రష్మిక.
టాలీవుడ్ మొత్తం ఈ ఇద్దరి చేతిలోనే ఉన్నట్లు ఉంది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. టాప్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్నారు. ఇక ఇండస్తృఈకి వచ్చిన అతి తక్కువ టైంలోనే రష్మిక ఇలాంటీ పేరు సంపాదించుకుందంటే ఆమెలోని టాలెంట్ ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. మొదటి సినిమానే మంచి హిట్ కొట్టడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అందానికి అందం, నటనకు నటనతో ఆకట్టుకుంటూ.. ఇండస్ట్రీలికి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో జతకట్టి..మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.
అంతేనా హిట్ మోజులో వచ్చిన అవకాశాలనంటిని సైన్ చేయకుండా మెల్లగా తన తెలివితేటలతో మంచి మంచి స్టొరీ లైన్ ఉన్న కధలను చూస్ చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇక రష్మిక చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో ‘గోల్డెన్ లెగ్’ అనే ముద్ర కూడా ఉంది. దాంతో దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. తన క్యూట్‌లుక్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తున్న రష్మిక అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి ఈ భామ అందానికి గల కారణం ఏముంటుంది? రోజూ రష్మిక అసలు ఏం తింటుంది అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే, రీసెంట్ గా తన అందానికి సంబందించిన సీక్రేట్స్ ఫుడ్ డీటైల్స్ ని అభిమానులతో పంచుకుంది రష్మిక.
తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో రష్మిక తన ఒక్కరోజు డైట్ సీక్రేట్ ను రివీల్ చేసింది. ఓ వీడియో రూపంలో ఆమె షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటుందో బయటపెట్టింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. షూటింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ రష్మిక ఐస్డ్ కాఫీ ని తీసుకుంటుందట..ఆ తరువాత కొంచెం సెపటికి సెలెరీ జ్యూస్‌ని తీసుకున్నింది. ఇక ఆ తర్వాత భోజనం విషయానికి వస్తే బాదం వెన్నతో కూడిన ఓట్స్ ను స్పేషల్ గా తయాల్రు చేసుకుంటుందట.. మధ్యలో వాటర్ తాగుతూ.. సాయంత్రం టీని తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్ గా రాత్రి భోజనంలో చికెన్, మ్యాషుడ్ పొటాటోస్ ను తినేసింది. చాలా సింపుల్ గా హెల్తీ గా ఉండే ఈ రష్మిక డైట్ సీక్రేట్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఇది ఒక్కరోజు డైట్ మాత్రమే.
The happiest when I get my food! 😋🍲🤍
Check out what I eat on a shoot day on my YT now! https://t.co/wNYel27T6l
— Rashmika Mandanna (@iamRashmika) April 29, 2022