తప్పదు.. రెండూ నార్త్ ఇండియా సినిమాలు.. భారీ అంచనాలతో వచ్చాయి. పోలిక విషయంలో ఎవరికి ఎన్ని సందేహాలు ఉన్నా కూడా పోలిక పెడుతున్నారు. త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2లో ఏది గొప్ప, ప్రశాంత్ నీల్, రాజమౌళిలో ఎవరు గొప్ప ఇదే చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. కొందరు రాజమౌళి గొప్ప అంటే.. మరికొందరు నీల్ గ్రేట్ అంటున్నారు. అయితే ఓవరాల్‌గా సినిమా విషయానికి వస్తే మాత్రం ఎక్కువ మంది త్రిబుల్ ఆర్ కంటే కేజీయఫ్ 2 ఓ మెట్టు పైన ఉంటుందని అంటున్నారు.
సరే ఎవరు ? ఎవరి గురించి ఎంత గొప్పగా చెపుతున్నారో చూస్తే.. కేజీయఫ్ లాంటి సినిమా చేసేందుకు రాజమౌళికి కనీసం ఆరేడేళ్లు పడుతుందని.. అదే నీల్ చాలా తక్కువ టైంలో ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా తీశాడని అంటున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా బడ్జెట్ రు. 500 కోట్లు అని మేకర్స్ చెప్పారు. అదే కేజీయఫ్ 2ను కేవలం రు. 100 కోట్లతో త్రిబుల్ ఆర్ కన్నా బ్రహ్మాండంగా తీశాడని మెచ్చుకుంటోన్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.
ఇక హీరోయిజం ఎలివేషన్ విషయంలో త్రిబుల్ ఆర్ కన్నా కేజీయఫ్ 2 కాస్త ఓ ఇంచ్ పైన ఉన్నట్టే కనపడుతోంది. ఇద్దరూ కూడా సౌత్ సినిమాపై బాలీవుడ్ ఇగోను, అణగదొక్కే తనాన్ని బద్దలు కొట్టిన వాళ్లే. ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా రా అని గర్వంగా వెలుగెత్తి చాటేలా చేసినవాళ్లే. ట్రిబుల్ ఆర్ ఎలివేషన్లు చూసినోళ్లకే మతులు పోయాయి. అయితే ఇప్పుడు కేజీయఫ్ ఎలివేషన్లు చూశాక.. ఇదో అసాధారణ హీరోయిజం.. అసలు ఇంతకు మించి ఇంకేచూస్తాం అనేలా ఉంది.
రాజమౌళికి ఈ స్థాయికి రావడానికి 20 ఏళ్లు 12 సినిమాల టైం పట్టొచ్చు.. కానీ నీల్ మూడు సినిమాలకే ఈ స్థాయికి వచ్చాడని కొందరు అంటున్నారు. అయితే రాజమౌళిది 20 ఏళ్ల కెరీర్.. పైగా 12 సినిమాల్లో ఒక్క ప్లాపు కూడా లేదు. పైగా తెలుగు అనే ప్రాంతీయ భాషా సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప దర్శకధీరుడు. రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసిన ఘనత ఖచ్చితంగా ఆయనదే.. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీలే స్వయంగా ఒప్పుకున్నాడు.
బాలీవుడ్లో బడా స్టార్ హీరోలు సల్మాన్, షారుక్ లాంటి వాళ్లు ఒక్క హిట్ సినిమా కోసం కష్టపడుతోన్న వేళ మన సౌత్ డైరెక్టర్లు రాజమౌళి, నీల్, సుకుమార్ లాంటి వాళ్లు రీజనల్ సినిమాలతో బాలీవుడ్ మార్కెట్‌ను శాసిస్తున్నారు. ఇక రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో వచ్చాయి. త్రిబుల్ ఆర్ ఫస్ట్ డే రు. 223 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేజీయఫ్ రు. 160 కోట్ల వరకు వచ్చాయంటున్నారు.
ఇద్దరూ కూడా పాన్ ఇండియా సినిమాలు తీసే విషయంలో పోటాపోటీగానే ఉన్నా.. రాజమౌళి తీసుకునే టైంకు, ప్రశాంత్ తీసుకునే టైంకు కంపేరిజన్ చేస్తూ… మాస్ ఎలివేషన్స్, కమర్షియల్ సినిమాల విషయంలో రాజమౌళి కంటే ప్రశాంత్ బెటర్ అంటున్నారు. అయితే రాజమౌళి చాల జానర్లు తీసి హిట్ కొట్టి ఉన్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మగధీర, ఛత్రపతి, విక్రమార్కుడు, సింహాద్రి, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 1,2 ఇలా జానర్లు టచ్ చేశాడు. మరి నీల్ మూడు సినిమాలకే పాన్ ఇండియా లెవల్‌కు వచ్చినంత మాత్రానా అతడిని రాజమౌళి కంటే బెటర్ అని చెప్పలేమని మరి కొందరు అంటున్నారు.
రాజమౌళియే నీల్ కంటే గొప్ప అన్న విషయాన్ని ఒప్పుకోవాలి.. ఎందుకంటే నీల్ కెరీర్ ఇంకా చాలా ఉంది.. వరుసగా కొన్ని హిట్లు పడాలి.. ఈ ఫామ్ ఇలా కొన్నేళ్లు కంటిన్యూ కావాలి. మరీ ముఖ్యంగా వీళ్లలో ఎవరు గొప్ప అన్నది చెప్పడానికి వీళ్ల నెక్ట్స్ సినిమాలు రాజమౌళి – మహేష్‌బాబు, ప్రశాంత్ నీల్ – ప్రభాస్ సలార్ ఏ రేంజ్‌లో ఉంటాయి ? ప్రేక్షకులను ఎలా ? మెప్పిస్తాయి ? అన్న దానిబట్టి కూడా వీళ్ల ర్యాంక్ ఆధారపడి ఉంటుంది. అంతే కానీ కేజీయఫ్ 2 సీక్వెల్స్‌ను బట్టి నీల్ ఎలివేషన్లు బాగున్నంత మాత్రానా రాజమౌళి కంటే టాప్ అని చెప్పుకోవడం సరికాదు.
అయితే రాజమౌళి చాలా గ్రేట్ డౌట్ లేదు. అయితే కొన్ని విషయాల్లో మారాలి. ఆయన సినిమాల్లో డైలాగుల విషయంలో పెద్దగా ఇంఫాక్ట్ పడట్లేదు. కేజీయఫ్ 2 డైలాగులు ఎలా అదిరిపోయాయ్ అసలు. అలాగే బాహుబలితో పోలిస్తే త్రిబుల్ ఆర్ విషయంలో రాజమౌళి సీరియస్ నెస్ తగ్గిందా ? అనిపించింది. రాజమౌళి కంటే నీల్‌ను ఒక మెట్టు ఎక్కించే వాళ్లు టైం టేకింగ్, బడ్జెట్ విషయం పోల్చి చూసి చెపుతున్నారు. అయితే మూడు సినిమాల విజయాలు.. 12 వరుస విజయాలు… తిరుగులేని బ్లాక్‌బస్టర్లకు సరిపోల్చి చూడలేం. ఏదేమైనా వీరి నెక్ట్స్ సినిమాల తర్వాతే ఎవరు ఎంత గొప్ప అన్నది తేలిపోతుంది.