రాధిక 1980వ దశకంలో తెలుగులో స్టార్ హీరోయిన్.. తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలో, మళయాళంలో ఎందరో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అప్పట్లో ఏఎన్నార్ – రాధిక, కృష్ణ – రాధిక, చిరంజీవి – రాధిక, చంద్రమోహన్ – రాధిక ఈ కాంబినేషన్లకు ఎంతో క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఆ నాటి స్టార్ హీరోలు సైతం రాధికతో పోటీ పడి డ్యాన్సులు వేసేందుకు చాలా కష్టపడేవారు. రాధిక ఎనర్జిటిక్ యాక్టింగ్, డ్యాన్సులు, హీరోలనే డామినేట్ చేసేలా ఉండే ఆమె బిహేవియర్ ఆమెను చాలా స్పెషల్‌గా నిలబెట్టాయి.
రెండో వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమయ్యాక ఆమె కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కష్టాల్లో ఉన్నప్పుడు ఏర్పడిన పాత స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ వయస్సులోనూ వీరి దాంపత్య జీవితం, అనుబంధం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా రాధిక తెలుగులో ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పుడు తెలుగులో ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టం అని చెప్పారు. మిగిలిన హీరోల పేర్లు కూడా ప్రస్తావించినా.. ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు తాను చూస్తానని.. తనతో పాటు భర్త శరత్‌కుమార్ సైతం చూస్తారని చెప్పింది.
ఎన్టీఆర్ ఎనర్జిటిక్ యాక్టింగ్ అంటే తనకు, శరత్‌కుమార్‌కు ఎంతో ఇష్టం అని.. డ్యాన్సులు అద్భుతం అంటూ రాధిక ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇక తెలుగులో వైవిధ్యమైన కథలతో ఈ తరం జనరేషన్ హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారని.. తమిళంలో కమల్, రజనీని వదిలేస్తే ఇప్పుడున్న హీరోల్లో అజిత్, విజయ్ మినహా ఎవ్వరూ డిఫరెంట్ కథలతో సినిమాలు చేయడం లేదని రాధిక చెప్పారు.
అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తాను ఒకే ఒక్క సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు చేశానని.. ఆ సినిమా తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చేశారని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణ అంటే తనకు ఎంతో ఇష్టం అని.. ఆయన ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉంది అంటే.. 5.45 గంటలకే సెట్లో ఉండేవారని చెప్పాడు.
ఇక ఏఎన్నార్ విషయానికి వస్తే ఆయన సాంగ్ షూట్ చేసే టైంలో డ్యాన్స్ మూమెంట్స్‌కు కంఫర్ట్‌గా ఉండాలని ఓన్లీ టీ, బిస్కెట్, జ్యూస్ మాత్రమే తీసుకునేవారట. వాళ్ల నుంచి తాను చాలా నేర్చుకున్నానని రాధికా శరత్‌కుమార్ చెప్పారు. ఇక లేడీ విలన్‌గా అయినా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెపుతూనే శంకర్ జీన్స్ సినిమాలో అదే పాత్రలో నటించానని చెప్పారు.