Moviesరాజ‌మౌళి క‌న్నా పూరి జ‌గ‌న్నాథే గ్రేట్‌... జ‌క్క‌న్న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌నం..!

రాజ‌మౌళి క‌న్నా పూరి జ‌గ‌న్నాథే గ్రేట్‌… జ‌క్క‌న్న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌నం..!

విజ‌యేంద్ర ప్ర‌సాద్ టాలీవుడ్‌లో మాత్ర‌మే కాదు.. దేశం మెచ్చిన స్టార్ రైట‌ర్ల‌లో ఒక‌రు. స‌మ‌ర‌సింహారెడ్డి లాంటి సూప‌ర్ హిట్ సినిమాకు ముందు వ‌ర‌కు విజ‌యేంద్ర ప్ర‌సాద్ జ‌స్ట్ తెలుగు క‌థా ర‌చ‌యిత‌ల్లో ఒక‌రు. ఆ సినిమా త‌ర్వాత ఆయ‌నో స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. క‌ట్ చేస్తే ఇప్పుడు దేశం మొత్తం మెచ్చే స్టార్ రైట‌ర్ అయిపోయారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయ‌న క‌థ‌ల కోసం కాచుకుని కూర్చొనే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

ఈ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ త‌న‌యుడు అయిన రాజ‌మౌళి ఇప్పుడు ప్ర‌పంచ‌మే మెచ్చేంత గొప్ప డైరెక్ట‌ర్ అయిపోయాడు. రాజ‌మౌళి సినిమాలు అన్నింటికి విజ‌యేంద్ర ప్ర‌సాదే స్టోరీ ఇచ్చారు. సినిమా సినిమాకు విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో స్టార్ రైట‌ర్ మాత్ర‌మే కాదు ప్ర‌పంచ‌మే మెచ్చేంత గొప్ప రైట‌ర్ అయిపోతున్నారు. విచిత్రం ఏంటంటే 2015లో వారం రోజుల గ్యాప్‌లో బాహుబ‌లి పార్ట్ 1తో పాటు స‌ల్మాన్‌ఖాన్ భ‌జ‌రంగి భాయ్‌జాన్ సినిమాల‌కు ఆయ‌న స్టోరీ ఇచ్చారు.

ఏఆర్‌. రెహ్మ‌న్ అంత‌టి స్టార్ స్టోరీ రైట‌రే అదిరింది ( మెర్స‌ల్‌) ఆడియో ఫంక్ష‌న్లో విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ను ఓ స్టోరీ కావాల‌ని అడిగారు. స‌ల్మాన్ ఖాన్‌, అమీర్‌ఖాన్ లాంటి వాళ్లు సైతం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ను త‌మ‌కు మాంచి స్టోరీ కావాల‌ని రిక్వెస్టులు చేసుకుంటున్నారు. ఇక తాజాగా వ‌చ్చిన త్రిబుల్ ఆర్ స్టోరీ సైతం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చెక్కిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆయ‌న ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు రాజ‌మౌళి కంటే డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అంటే ఇష్ట‌మ‌ని… చెప్ప‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. రాజ‌మౌళి నా కొడుకు అయినా కూడా డైరెక్ట‌ర్‌గా పూరి అంటే ఇష్ట‌మ‌ని చెప్పాడు. పూరి టెక్నిక్ అంటే త‌న‌కు, రాజ‌మౌళికి కూడా చాలా చాలా ఇష్టం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమాల్లో హీరో ఎవ‌రిని అయినా కొట్టాలి అంటే తాను కాని.. రాజ‌మౌళి కాని క‌నీసం 10 నిమిషాలు ఆలోచించేలా ముందు నుంచే సీన్లు ప్రిపేర్ చేస్తామ‌ని.. కానీ పూరి సినిమాల్లో హీరో ఎవ‌రిని అయినా కొట్టాల‌ని అనుకుంటే జ‌స్ట్ ఒక్క క్ష‌ణం చాల‌ని చెప్పాడు.

పూరి పాటించే ఈ టెక్నిక్ త‌న‌కు ఎంతో న‌చ్చుతుంద‌ని చెప్పడంతో త‌న ఫోన్లో ఉన్న పూరి జ‌గ‌న్నాథ్ స్మైలీష్ ఇమేజ్‌ను కూడా చూపించాడు. వాస్త‌వానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చెప్పింది కూడా నిజ‌మే. రాజమౌళి సినిమాల్లో హీరో, విల‌న్ ఎదురు ప‌డాల‌న్నా.. హీరో, విల‌న్‌ను కొట్టాల‌న్నా ప‌ది నిమిషాలు ముందు నుంచే పెద్ద యుద్ధవాతావ‌ర‌ణం క్రియేట్ చేస్తూ ఉంటారు. క‌నీసం ముందు రెండు, మూడు సీన్లు ఉంటాయి. అయితే పూరి సినిమాల్లో హీరో అవారాగా ఉంటూ చ‌టుక్కున విల‌న్‌ను చెంప‌మీద కొట్ట‌డ‌మో లేదా సింపుల్‌గా కొట్టేయ‌డ‌మో చేసేస్తూ ఉంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news