రాజమౌళి త్రిబుల్ ఆర్ సక్సెస్ మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. ఈ సినిమా కోసం మూడున్నరేళ్లుగా ఎంత కష్టపడ్డారో తెరమీద చూస్తేనే తెలుస్తోంది. నెక్ట్స్ రాజమౌళితో పాటు ఆయన ఫ్యామిలీ అంతా మహేష్‌బాబు సినిమా మీద పడిపోతారు. అది ఎన్నేళ్లకు పూర్తవుతుందో తెలియదు. రాజమౌళి సినిమా అంటేనే కథ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ది. దర్శకుడు రాజమౌళి. రాజమౌళి భార్య రమా కాస్ట్యూమ్ డిజైనర్. ఇక సంగీత దర్శకుడిగా సోదరుడు కీరవాణి ఉంటారు. ఆయన భార్య వల్లి లైన్ ప్రొడ్యుసర్‌గా ఉంటారు. ఇక మార్కెటింగ్, డిజిటల్ వ్యవహారాలు అన్నీ రాజమౌళి కొడుకు కార్తీకేయ చూస్తారు. రాజమౌళి కుమార్తె మయూఖ కూడా సినిమాకు సంబంధించి వ్యవహారాలే చూస్తారు.
ఇక రాజమౌళి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా సినిమాకు ఏదో ఒక రూపంలో పని చేస్తూనే ఉంటారు. వీళ్లందరి ఎఫర్ట్ వల్లే రాజమౌళికి సగం టెన్షన్ తగ్గిపోతుంది. అయితే వీళ్లు తమ సినిమాల్లో పనిచేసే హీరోలను ఎంత టార్చర్ పెడతారు ? ఇంకా చెప్పాలంటే రాజమౌళి ఆ హీరోలను ఎంతలా పిండేస్తాడు ? అన్నది ఎన్టీఆరే స్వయంగా చెప్పాడు. త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో డైరెక్టర్ అనిల్ రావిపూడి త్రిబుల్ ఆర్‌లో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళితో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ సరదాగా చేశాడు. ఆ ఇంటర్వ్యూలోనే రాజమౌళి మాత్రమే కాదు.. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టే టార్చర్‌ను సరదగా చెప్పి అందరిని నవ్వించాడు.
ఎన్టీఆర్ అప్పుడే ఓ షాట్ కంప్లీట్ చేసి కాస్త రిలాక్స్ అవుదాం అని కుర్చీలో కూర్చునే లోపే వెంటనే మరో షాట్ అంటాడట. వెంటనే ఎన్టీఆర్ వల్లమ్మ ( కీరవాణి భార్య వల్లి)తో, ఇటు అమీన్ ( రమా రాజమౌళి)తో చంపేస్తున్నాడమ్మా… అంటే అప్పుడు వాళ్లిద్దరు పిచ్చి నాన్న పిచ్చి అంటే ఎన్టీఆర్ ఎప్పుడు తగ్గుతుంది అనడిగితే లేదమ్మా రోజు రోజుకు మరింత పెరిగిపోతుందని అంటారట.
ఈలోగా కార్తీకేయ వస్తే.. అతడికి అయినా కష్టాలు చెప్పుకుందాం అని అంటే అన్నా షాట్‌కు వెళదాం రా అంటాడట. నలిపేశాడురా ఇప్పటికే అని ఎన్టీఆర్ అంటే.. ఓ షాట్‌కు వెళ్లిరా బంగారం .. త్వరగా అయిపోతుందని బుజ్జగిస్తారట. ఇక రాజమౌళి భార్య రమాకు చంపేస్తున్నాడమ్మా అని రాజమౌళిపై కంప్లైంట్ చేస్తే అవునా ఎదవ సచ్చినోడు.. నువ్వు వెళ్లి షాట్ చేసుకువచ్చేయ్ అనడంతో పాటు వెళ్లరా బండోడా అని ఆడుకుంటారని చెప్పాడు.
ఇక మా బాధ ఎవ్వడూ పట్టించుకోవట్లేదు అని కార్తీకేయకు చెపితే ఫోన్ చెవికాడ పెట్టుకుని.. అన్నా ఒక్క సెకన్ అన్నా వెంటనే పక్కకు వెళ్లిపోతాడని ఎన్టీఆర్ తెలిపారు. గతంలో కార్తీకేయ ఏదైనా వినేవాడు అని.. ఇప్పుడు లైన్ ప్రొడ్యుసర్ కావడంతో మా మాట వినడం లేదన్నట్టుగా ఎన్టీఆర్ చెప్పాడు. ఇక అటుగా నడుచుకుంటూ వచ్చే కీరవాణితో సర్ జీ ఏంటీ కబుర్లు చంపేస్తున్నాడు అని అంటే.. ఆయన అంతే.. ఇదంతా నాకెందుకు చెపుతున్నావు… నేనే ఏమైనా చేస్తానా ? వాడు నామాట వింటాడా ? అని ఎస్కేప్ అయిపోతాడని తారక్ ఆ సంఘటనలు నెమరవేసుకున్నాడు. ఏదేమైనా త్రిబుల్ ఆర్ షూటింగ్‌లో అటు ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఇటు ఎన్టీఆర్, చెర్రీ కష్టాలు అయితే మామూలుగా లేవనే చెప్పాలి.