కేజీయఫ్ సినిమా తర్వాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు ప్రశాంత్ డైరెక్ట్ చేసిన కేజీయఫ్ 2 ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు తెలుగులో ఆచార్యను మించిన రేంజ్లో బిజినెస్ జరిగింది అంటేనే కేజీయఫ్ 2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థమవుతోంది. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ తన 31వ సినిమాను కొరటాల శివకు కమిట్ అయ్యాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే కొరటాల ఆచార్య ఈ నెల 29న రిలీజ్ అవుతుండడంతో ఆ హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే కొరటాల – ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఇక కేజీయఫ్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ప్రభాస్‌తో సలార్ సినిమాను పూర్తి చేస్తాడు. రెండు పార్టులుగా వస్తోన్న సలార్ వచ్చే యేడాది మార్చిలోగా పూర్తి చేసే ఛాన్సులు ఉన్నాయి.
ఈ లోగా ఎన్టీఆర్ – కొరటాల సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ 32వ ప్రాజెక్టు.. ప్రశాంత్ నీల్తోనే ఉంటుంది. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్డేట్ బయటకు వచ్చేసింది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణేను హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
దీపిక ఇప్పటికే సౌత్‌లో యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా చేస్తోంది. దీపిక ఈ సినిమాలో చేరితే అసలు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాకు మామూలు క్రేజ్ రాదు. దీపిక ఉంటే నార్త్‌లో, ఇటు ప్రశాంత్ నీల్ దెబ్బకు కన్నడంలో.. ఇటు తెలుగులో ఎన్టీఆర్ ఇలా ఓవరాల్‌గా ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లే ముందే ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అవుతుంది.
ఇక హీరోయిన్ పేరు బయటకు రావడంతోనే ఎన్టీఆర్ – నీల్ కాంబినేషన్ కేక పెట్టించేసింది. కేజీయఫ్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. తాను గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు అభిమానిని అని.. తాము ఇప్పుడు బాగా క్లోజ్‌ఫ్రెండ్స్ అయిపోయామని చెప్పాడు.