టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. దర్శకధీరుడు రాజమౌళి మూడున్నరేళ్లుగా కష్టపడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు తోడుగా.. మరో స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా నటించాడు. డీవీవీ దానయ్య రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రు. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లు దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లోనే 13 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొట్టేసింది.
త్రిబుల్ ఆర్ సక్సెస్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. అలియాభట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిక్కలినేని సుధాకర్‌తో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక త్రిబుల్ సక్సెస్ నేపథ్యంలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ ముంబైలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఈ ఫంక్షన్‌కు త్రిబుల్ ఆర్ టీంతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఈ ఫంక్షన్‌లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. విదేశ్రీ బ్రాండ్ అయిన పటేక్ ఫిలిప్ నాటిలస్ 5712 1/ఎ(Patek Philippe Nautilus 5712 1/A) వాచ్ ధరించి ఎన్టీఆర్ ఈ ఫంక్షన్‌కు వచ్చాడు. ఆ వాచ్ కెమేరా కళ్లకు ప్రముఖంగా కనపడడంతో వాళ్లు క్లిక్ మనిపించేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ ఖరీదైన వాచ్ ఖరీదు ఎంత అన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఎన్టీఆర్ కార్లతో పాటు వాచ్‌లు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తాడు. ఇక ఎన్టీఆర్ తాజా వాచ్ కోసం ఏకంగా రు 1.70 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఈ ఖర్చు విషయం ఇప్పుడు సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. ఈ వాచ్‌పై మీరు కూడా ఓ లుక్కేస్తే దీని స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది.