త్రిబుల్ ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కొరటాల శివతో ఫిక్స్ అయిపోయింది. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కుదిరితే ఆచార్య రిలీజ్ అయ్యాక.. ఆ సినిమా ప్రమోషన్లు కంప్లీట్ చేసుకుని.. మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కంటిన్యూ చేసేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. అలియాభట్ హీరోయిన్‌గా దాదాపు ఫిక్స్ అయిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు సానా తో ఎన్టీఆర్ హీరోగా పెద్ది టైటిల్‌తో సినిమా ఫిక్స్ అయిపోయిందనే ఓ ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఓ అనుబంధం ఉంది. ఉప్పెన హిట్ అయ్యాక బుచ్చిబాబు స్పోర్ట్స్ నేపథ్యంలో ఉన్న కథ తీసుకువెళ్లి ఎన్టీఆర్‌కు చెప్పడం.. ఎన్టీఆర్‌కు నచ్చడం అయితే జరిగిపోయాయి.
అయితే ఈ కథతో ఎన్టీఆర్ సినిమా చేస్తే చూడలేం అనే ఇండస్ట్రీలో ఓ టాక్ బయటకు వచ్చింది. ఇది స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథ అయినా కూడా… 1980ల్లో సాగే కథ అట. పెద్ది అన్న టైటిల్ పెట్టుకున్నారు. ఈ టైటిల్ అంత పవర్ ఫుల్‌గా అయితే ఉన్నట్టు లేదు. పైగా కొన్ని సీన్లలో ఎన్టీఆర్ వికలాంగుడిగా కనిపిస్తాడట. అసలు ఇలాంటి ఇమేజ్ ఉన్న కథలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్సప్ట్ చేస్తారా ? అన్న చిన్న సందేహాలు అయితే ఉన్నాయన్న చర్చే ఎక్కువుగా ఉంది.
అందుకే బుచ్చిబాబు పదే పదే ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నా… ఎన్టీఆర్ మాట ఇవ్వడం లేదని అంటున్నారు. అలాగని ఈ కథపై ఎన్టీఆర్‌కు మనసు కూడా ఉందట. అటు వైపు బుచ్చిబాబుకు కథ మార్చేందుకు కూడా ఇష్టం లేదట. కథ మారిస్తే మళ్లీ స్క్రీన్ ప్లే మొత్తం మారిపోతుందన్నది బుచ్చిబాబు బాధ. అందుకే ఈ సినిమా వార్తల్లో నలుగుతున్నా ప్రకటన రావడం లేదు.
ఆ మాటకు వస్తే ఉప్పెన సినిమాలోనూ ఇలాంటి రిస్కీనే ఉంది. క్లైమాక్స్ మార్చమని చాలా మంది బుచ్చిబాబుపై ఒత్తిడి చేశారు. అయితే బుచ్చిబాబు మార్చకుండా తాను అనుకున్న సిద్ధాంతం మేరకే వెళ్లిపోయాడు. చివరకు సినిమా హిట్ అయ్యి.. బుచ్చిబాబు ఐడియానే కరెక్ట్ అయ్యింది. ఇప్పుడు పెద్ది విషయంలోనూ అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఏదేమైనా త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలనుకున్నప్పుడు ఇంత రిస్క్ చేస్తాడా ? అన్నది చూడాలి.