రాజమౌళి సినిమాల్లో ఏ హీరో అయినా నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయితే అదే హీరో తర్వాత నటించిన సినిమా ఘోరంగా ప్లాప్ అవుతుంది. ఇది ఇప్పటి నుంచే కాదు.. రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి జరుగుతూ వస్తోందే. ఆ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్, రవితేజ, రామ్‌చరణ్, సునీల్.. మళ్లీ ప్రభాస్‌తో బాహుబలి ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు.
రాజమౌళి ఏ హీరోతో అయినా సినిమా చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా ఆ హీరో కెరీర్ హిట్ అయిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత ఆ హీరో ఎంత పెద్ద డైరెక్టర్‌తో.. ఎంత పెద్ద కాంబినేషన్లో సినిమా చేసినా ఘోరమైన డిజాస్టర్ అవ్వాల్సిందే. ఇది రాజమౌళి ప్రతి సినిమాకు జరుగుతూ వస్తోందే. దీంతో ఈ బ్యాడ్ సెంటిమెంట్ రాజమౌళిపై గట్టిగా పడిపోయింది.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ చేసిన మగధీర ఇండస్ట్రీ హిట్. ఆ వెంటనే వచ్చిన ఆరెంజ్ డిజాస్టర్. ఇక గత నెలలో ఇద్దరు టాలీవుడ్ క్రేజీ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ ఇద్దరు కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ త్రిబుల్ ఆర్ వచ్చింది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ప్రెస్టేజియస్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రు. 1200 కోట్లతో తిరుగులేని బ్లాక్‌బస్టర్ అయ్యింది. బాహుబలి 2తో పోల్చి చూస్తే కాస్త తగ్గినట్టు ఉన్నా రాజమౌళి స్థాయి సినిమా అనిపించుకుంది.
ఈ సినిమాలో నటించిన చెర్రీ నెల రోజుల గ్యాప్‌లోనే ఈ రోజు ఆచార్య సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యి ఆచార్య ప్లాప్ అవుతుందన్న సందేహాలు ముందే వచ్చాయి. వీటికి క్లారిటీ ఇస్తున్నానన్నట్టుగా చిరు స్వయంగా తాను అలాంటి సెంటిమెంట్‌ను నమ్మనని ఆచార్య సూపర్ హిట్ అవుతుదని చెప్పారు.
అయితే ఇప్పుడు ఆచార్య సినిమాకు వస్తోన్న టాక్ చూస్తే ఖచ్చితంగా రాజమౌళి సెంటిమెంట్ రిపీట్ అయినట్టే కనిపిస్తోంది. ఆచార్య బాగా డిజప్పాయింట్ చేసిందనే ప్రతి ఒక్కరి నోటి వెంటా వస్తోంది. ఏ రివ్యూ కూడా ఆచార్యకు 3 రేటింగ్ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. అసలు మెగాభిమానులనే ఆచార్య డిజప్పాయింట్ చేసిందని అంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ఆచార్యపై కూడా గట్టిగానే పడినట్టు కనిపిస్తోంది.