హీరోయిన్ అంటే కేవలం అందం చూపించేది మాత్రమే కాదు… నటనతో ప్రేక్షకులను కట్టి పడేసేది. అయినా ఇప్పుడు నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు. అదంతా సావిత్రి, జయసుధ, వాణిశ్రీ.. ఆ తర్వాత కాలంలో రమ్యకృష్ణ, సౌందర్య లాంటి వాళ్లతోనే పోయింది. ఈ మధ్య కాలంలో మహానటి సినిమాలో కీర్తి సురేష్ మాత్రమే తన నటనతో ప్రేక్షకులను మెప్పించి కన్నీళ్లు పెట్టించింది.
ఇక ఆ తర్వాత ఎంత మంది హీరోయిన్ల గురించి చెప్పుకున్నా.. చూపించడానికి … చూడడానికి తప్పా చేయడానికేం లేదు. ఎంత వరకు ఎంత చూపిద్దాం… ఎంత బాగా చూపిద్దాం… ఎంత ఎక్కువ క్యాష్ చేసుకుందాం ఇదే ఆలోచనతో ఇప్పటి హీరోయిన్లు ఉంటున్నారు. ఒక్కటంటే ఒక్క సీన్లో ఎక్స్‌ప్రెషన్ ఉండదు.. పైగా డైలాగూ చెప్పలేరు.. మన కర్మకు వీళ్లంటా ఆ స్టార హీరోయిన్లు.
సరిగ్గా ఇప్పుడు పూజా హెగ్డే విషయానికి వస్తే ఇదే అనిపిస్తుంది. ఆమెకు నటన రాదన్న విషయం చాలా మంది అంటూ ఉంటారు. మాస్క్ లాంటి డిజాస్టర్ తర్వాత ఆమెను ఎవ్వరూ పట్టించుకోకపోతే మనోళ్లు ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోలకు ఆమే కావాలి.. స్టార్ డైరెక్టర్లకు పూజాయే కావాలి.
ఏదో అందం ఉంది కదా ? అని అందరూ ఆమె వెంటే పడుతున్నారు. పైగా త్రివిక్రమ్ లాంటోడే వరుసగా మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తే ఆమె కళ్లు నెత్తికెక్కవా ? అనే వాళ్లూ ఉన్నారు. ఇక బన్నీ లాంటోడే రెండు సినిమాల్లో ఛాన్స్. ఇంకేముందు ఆమె ఆడింది ఆట.. పాడింది పాటే అయ్యింది. సమంత తన కెరీర్‌లో ఇప్పటి వరకు పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్‌కు కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంది. బహుశా ఆమె కెరీర్‌లో ఇదే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అయి ఉండవచ్చు.
ఇప్పుడు పూజా ఆ రికార్డులను తుడిచేస్తోంది. సమంతను తప్పుపట్టలేం.. ఆమెను తెలుగోళ్లు ఇంత పెద్ద స్టార్‌ను చేశారన్న కృతజ్ఞత ఆమెలో కనిపిస్తుంది. పైగా సేవా కార్యక్రమాలూ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పూజాకు అవేమి లేకపోయినా.. కనీసం కృతజ్ఞత ఉండకపోయినా కూడా ఆమె ఎఫ్ 3 స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా 1.75 కోట్లు తీసుకుంటోందట. ఎఫ్ 2 లాంటి హిట్ తర్వాత పూజా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని.. దిల్ రాజు, అనిల్ రావిపూడి ఎందుకు అనుకున్నారో వాళ్లకే తెలియాలి.
ఇక పూజ ఓ సినిమాకు హీరోయిన్‌గా సైన్ చేయాలంటే రు. 3 కోట్ల నుంచి 3.5 వరకు.. అది కూడా కాల్లీట్లను బట్టి డిమాండ్ చేస్తోందట. అసలు కొన్ని సినిమాల్లో ఆమె ఎక్స్‌ప్రెషన్లు చూసే రివ్యూవర్లకు కళ్లు బైర్లు కమ్ముతూ ఉంటాయ్. పైగా ఆమె బీస్ట్, రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్లతో ఐరెన్‌లెగ్ ముద్ర కూడా వేయించుకుంది. ఈ టైంలో ఆమెకు మన తెలుగు నిర్మాతలు ఎందుకు కోట్లు కుమ్మరిస్తున్నారో ? వాళ్లకే తెలియాలి.