ప్రస్తుతం కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న సినిమా..”ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, రాంచరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఫ్యాన్స్ ఏ మాత్రం విసిగిపోకుండా..సినిమాకి బజ్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఫైనల్ గా ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దీంతో మెగా, పవర్ స్టార్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్సు బుకింగ్ ఊపందుకొన్నది. ఈ క్రమంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు చిత్ర బృందం.అయితే అంతా సజావుగా సాగిపోతుందిలే అనుకునే టైంకి సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆచార్య పై కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
మనకు తెలిసిందే..ఈ సినిమాలో నటిస్తున్న చరణ్..ఇది వరకే.. RRR సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. సినిమాలో పర్ ఫామెన్స్ పరంగా అయితే చించేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చరణ్ నటను ఆకాశానికి ఎత్తుతూ పొగిడేశారు. ఇప్పుడు చర్ణ్ నుంచి వచ్చే అన్ని సినిమాల పై ఆ ఎఫెక్ట్ పడుతుంది. నిజం చెప్పాలంటే చరణ్ RRR లో కనిపించిన్నంత హైలెట్ గా ఆచార్యలో కనిపించరు.. రాజమౌళి మాయ వేరే.’
ఆ మ్యాజిక్ కొరటాల అందుకోలేడు. కానీ కొరటాల స్టైల్ ఢిఫరెంట్ . రెండింటిని వేరుగా చూస్తే..సినిమా బాగుంటుంది. కానీ కంపెర్ చేసి చూస్తే ఖచ్చితంగా..వర్క్ అవుట్ అవ్వదు.. కొరటాల దెబ్బై పోతాడు. పై KGF 2 హిట్ వేడి ఇంకా తగ్గలేదు. RRR, KGF 2 ల మాదిరి ఆచార్య ఉండదు. అది మనం గమనించాల్సిన విషయం. అయితే.. ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు చూసిన ప్రేక్షకుల అంచనాలను ఆచార్య అందుకుంటుందా? ఆ చిత్రాల స్థాయిలో ఆచార్య విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ టెక్నిక్స్‌తో సగటు ప్రేక్షకుడి అంచనాలను కొరటాల అందుకుంటాడా లేదా అనే చర్చ జరుగుతోంది.