అక్కినేని నాగార్జున టాలీవుడ్‌లో తిరుగులేని మన్మథుడు, ఓ కింగ్.. దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడిగా ఇండస్ట్రీని ఏలేశాడు. ఇక ఇప్పుడు ఆయన వారసులు ఇద్దరు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి వెండితెరను ఏలుతున్నారు. వీరిద్దరికి డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. పెద్ద కుమారుడు నాగచైతన్య.. అటు మరో దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడికి మనవడు అవుతాడు. నాగార్జున మొదటి భార్య లక్ష్మి.. నాగార్జునకు మొదటి భార్య. చైతు పుట్టాక స్పర్థలతో వీరు విడిపోయారు.
ఆ తర్వాత హీరోయిన్ అమలను పెళ్లాడగా.. ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. అఖిల్ – చైతు వేర్వేరు తల్లులకు పుట్టినా కూడా సొంత అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటారు. ఇక చైతు ప్రస్తుతం బంగార్రాజు, లవ్‌స్టోరీలు హిట్ అవ్వడంతో ఆ జోష్‌లో ఉన్నాడు. అమీర్‌ఖాన్‌తో కలిసి నటిస్తోన్న లాల్‌చద్దా సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అఖిల్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు.
ఇక చైతు .. హీరోయిన్ సమంతకు గత యేడాది అక్టోబర్‌లో విడాకులు ఇచ్చేసి సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే చైతుకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ తమ్ముడు ఎవరో కాదు.. నాగార్జునకు విడాకులు ఇచ్చేశాక లక్ష్మి చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త రాఘవన్‌ను పెళ్లాడింది. ఈ దంపతుల కుమారుడే చైతుకు వరుసకు తమ్ముడు అవుతాడు.
చైతు చిన్నప్పుడు చాలా కాలం చెన్నైలో తల్లి లక్ష్మి దగ్గరే పెరిగాడు. ఆ తర్వాత నాగార్జున దగ్గరకు వచ్చాడు. చిన్నప్పుడు చైతు, అటు తన పినతండ్రి కుమారుడు కలిసే కొద్ది రోజులు పెరిగారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రిందట అతడి పెళ్లి జరిగినప్పుడు చైతు అప్పుడు తన భార్య సమంత సమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు. ఈ పెళ్లి ఫొటోలు కూడా అప్పుడు వైరల్ అయ్యాయి.
ఇక చైతు.. సమంతను ప్రేమించినప్పుడు కూడా తండ్రి నాగార్జున కంటే ముందే తల్లి లక్ష్మికి చెప్పాడు. సమంత కూడా చెన్నైలోనే ఉండే మాజీ అత్తమ్మ లక్ష్మి దగ్గరకు వెళ్లి అక్కడే అప్పుడప్పుడూ ఉండేది. ఇక వీరి మధ్య స్పర్థలు వచ్చినప్పుడు కూడా లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడేందుకు ట్రై చేసింది. అయితే అప్పటికే సమంత విడిపోవాలని ఖరాఖండీగా నిర్ణయం తీసుకుందని.. లక్ష్మి కలపాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదని టాక్ ?