పాపం ఏ ముహూర్తాన కొరటాల శివ – చిరంజీవి ఆచార్య సినిమా పట్టాలు ఎక్కిందో కాని.. మూడు సంవత్సరాల నుంచి నానుతూనే వస్తోంది. అదిగో ఆచార్య.. ఇదిగో పులి అన్న చందంగా ఎప్పటికప్పుడు రిలీజ్ అంటూనే ఉన్నారు.. వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అసలు ఆచార్య ఎప్పుడో యేడాదిన్నర క్రితమే రిలీజ్ కావాల్సిన సినిమా. అయితే కరోనా రెండు సార్లు రావడం.. మొన్న సంక్రాంతికి పెద్ద సినిమాలు ముందే షెడ్యూల్ అయి ఉండడంతో ఆచార్యను పలుసార్లు తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు ఏప్రిల్ 29కు వాయిదా వేశారు.
చిరంజీవి – చరణ్ – కొరటాల శివ – కాజల్ అగర్వాల్ – పూజా హెగ్డే ఇలా భారీ కాంబినేషన్లో తయారైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో నెలలు.. సంవత్సరాలు దాటుకుని ఎట్టకేలకు ఈ నెల 29న థియేటర్లలోకి దిగుతోంది అనుకుంటోన్న టైంలో ఆచార్యను కొత్త కష్టాలు చుట్టుముట్టాయి. ఆచార్య ప్రి రిలీజ్ బిజినెస్, భేరసారాలు ఎప్పుడో అయిపోయాయి. కొరటాలకు మార్కెట్‌పై మంచి పట్టు ఉంది.
అందుకే ఏరియాల వారీగా ఆయనే దగ్గరుండి మరీ ప్రి రిలీజ్ బిజినెస్ చేయించాడు. మామూలుగా అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ రేట్లకే అమ్మారు. ఉదాహరణకు నైజాం ఏరియాలో దిల్ రాజును కాదని వరంగల్ శ్రీను లాంటి వాళ్లకు రు. 42 కోట్ల ఫ్యాన్సీ రేటుకు అమ్మారు. ఇది చాలా పెద్ద మొత్తం. కొరటాలకు దిల్ రాజుకు ఎక్కడో తేడా కొట్టింది. అందుకే కొరటాలే పట్టుబట్టి మరీ శ్రీనుకు వచ్చేలా చేశాడని టాక్ ? అందుకే దిల్ రాజు కక్ష కట్టి మరీ ఈ సినిమాకు ఒక రోజు ముందే తన ఎఫ్ 3ను థియేటర్లలోకి వదులుతున్నాడని అంటున్నారు.
సరే ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను కొన్న బయ్యర్లు తమకు డిస్కౌంట్ కావాలని బేరసారాలు మొదలు పెట్టేశారు. వాళ్లంతా ఎప్పుడో యేడాది క్రితమే అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఈ వడ్డీలు కలుపుకుంటే చాలా అయిపోయింది. అయితే ఇప్పుడు బయ్యర్లు పాత రేట్లకు సినిమాను కొనేందుకు ఇష్టపడడం లేదు. రిలీజ్‌కు ఇంకా నాలుగు వారాల టైం అయితే ఉంది. ప్రస్తుతానికి వీళ్లు డిస్కర్షన్లు గట్టిగానే చేస్తున్నారు.
అంత పెద్ద త్రిబుల్ ఆర్ సినిమాకే యేడాదిన్నర ముందు అడ్వాన్స్‌లు ఇస్తేనే.. ఏ మాత్రం డిస్కౌంట్ ఇవ్వలేదు. అయితే త్రిబుల్ ఆర్‌కు జీఎస్టీ పార్ట్ మాత్రం ఇచ్చారు. అలా ఇచ్చినా ఏకంగా 18 % డిస్కౌంట్ వచ్చింది. మరి ఇప్పుడు ఆచార్య విషయంలో ఏం చేస్తారో ? చూడాలి.