మెగా ఫ్యాన్స్‌కు ఇటీవల వరుసగా పూనకాలు తెప్పించేలా ఇండస్ట్రీలో వాతావరణం నడుస్తోంది. వరుస పెట్టి మెగా హీరోల సినిమాలు రిలీజ్ కావడం.. మెగా అభిమానులను ఖుషీ చేసే వార్తలు రావడం జరుగుతూ వస్తోంది. గత డిసెంబర్ తర్వాత చూస్తే పుష్ప, భీమ్లానాయక్, త్రిబుల్ ఆర్, గని.. ఈ పరంపరలో ఈ నెలలో ఆచార్య.. ఆ వెంటనే గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు వరుస పెట్టి థియేటర్లలోకి వస్తూ మెగాభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
ఇక మెగా మల్టీస్టారర్ సినిమాలు కూడా వరుసగా లైన్లో ఉంటున్నాయి. ఇప్పుడు ఆచార్య, ఆ తర్వాత పవన్ – సాయితేజ్, పవన్ – వైష్ణవ్ తేజ్ సినిమాలపై కూడా కథా కసరత్తులు జరుగుతున్నాయి. ఇక వచ్చే నెలలోనే మెగా హీరో వరుణ్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్ 3 కూడా లైన్లో ఉంది. ఇలా ఈ సినిమాలు అన్ని మెగాభిమానులకు మామూలు విందు కాదు. అయితే పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ కాంబినేషన్లో కూడా ఓ సినిమా వస్తుందన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. త్వరలోనే అవి నిజం కాబోతున్నట్టు రామ్‌చరణ్ క్లారిటీ ఇచ్చేశారు.
చరణ్ గత నెలలోనే త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ నెలలో తండ్రి చిరుతో కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఆచార్యతో మరోసారి నెల గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆచార్య ప్రమోషన్లలో బిజీగా ఉన్న చెర్రీ పవన్ కళ్యాణ్‌తో తన సినిమా గురించి మాట్లాడారు. వాస్తవానికి చెర్రీ కొణిదెల కంపెనీ స్టార్ట్ చేసి తన తండ్రితో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటి నుంచే చెర్రీ నిర్మాణంలో పవన్ హీరోగా చేసే సినిమా గురించి వార్తలు వచ్చాయి.
దీనిపై ఆచార్య ప్రమోషన్లలో మాట్లాడుతూ నా బ్యానర్లో బాబాయ్ హీరోగా సినిమా చేసినా… బాబాయ్ బ్యానర్లో తాను హీరోగా రెండు సినిమాలు ఉంటాయని… తామిద్దరం ఎవరం చేసినా ప్రొడ్యుసర్‌గానే కాకుండా… కో ప్రొడక్షన్‌లో అయినా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పాడు. దీనిని బట్టి సొంతంగా మాత్రమే కాకుండా.. మరో బ్యానర్‌తో అసోసియేట్ అయ్యి అయినా పవన్‌తో సినిమా చేసేందుకు చెర్రీ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఆచార్య సినిమాను కూడా చెర్రీ.. మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఆచార్య సినిమాలోకి ముందు తాను నిర్మాతగా మాత్రమే ఎంటర్ అయ్యానని.. ఆ తర్వాత తన పాత్రకు ముందుగా మరో హీరోను ఆప్షన్‌గా అనుకున్నా.. చివరకు తాను హీరోగా కూడా ఎంటర్ అయ్యానని చెప్పారు.