మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన సినిమా గని. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ పాత్రలో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది.
మా అధ్యక్షుడు, మంచు హీరో మంచు విష్ణు ఈ సినిమాపై ట్వీట్ చేశారు. ఓ హీరో నటించిన సినిమా రిలీజ్ అయినప్పుడు మరో హీరో ఆ సినిమాను హిట్ అవ్వాలని కోరుతూ ట్వీట్ చేయడం మామూలే. అయితే ఇటీవల టాలీవుడ్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తోంది. మా ఎన్నికల నుంచి ఇది మరింత ముదిరిపోయింది.
మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన ప్రకాష్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. అప్పుడు నాగబాబు మంచు ఫ్యామిలీని, మంచు విష్ణును టార్గెట్ చేస్తే.. ఇటు మంచు ఫ్యామిలీ నాగబాబును కూడా టార్గెట్ చేస్తూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇక ఇటీవల మంచు మనోజ్ నాగబాబుపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
పైగా మంచు ఫ్యామిలీని నాగబాబు ఎక్కువుగా టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో నాగబాబు కుమారుడు వరుణ్ సినిమా హిట్టవ్వాలని మంచు విష్ణు కామెంట్ చేయడం ఆసక్తి అయ్యింది. అయితే నెటిజన్లు మాత్రం విష్ణును ట్వీట్‌ను ట్రోల్ చేశారు. మనసులో సినిమా ప్లాప్ కావాలని గట్టిగా కోరుకున్నావ్ కదా అని విష్ణును కౌంటర్ చేశారు. దీనిపై స్పందించిన విష్ణు నెగిటివిటి ఎందుకు ? స్ప్రెడ్ చేస్తున్నారు ? పాజిటివ్‌గా ఆలోచించండని రిప్లే ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్.. దీనిపై ట్రోలింగ్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.
Wishing all the best for my brother @IAmVarunTej for #Ghani. Wishing you a grand success 💪🏽
— Vishnu Manchu (@iVishnuManchu) April 8, 2022