Movies12 ఏళ్ల చిన్నోడితో డేటింగ్‌... పెళ్లి... మ‌లైకా అరోరా ఘాటు కామెంట్స్‌..!

12 ఏళ్ల చిన్నోడితో డేటింగ్‌… పెళ్లి… మ‌లైకా అరోరా ఘాటు కామెంట్స్‌..!

దేశ‌వ్యాప్తంగానే గ‌త నాలుగైదేళ్లుగా మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ డేటింగ్ సంచ‌ల‌నాత్మ‌కంగా వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. బాలీవుడ్‌లో పెళ్లిళ్లు, ప్రేమ‌లు, విడాకులు, డేటింగ్‌లు కామ‌న్‌.. ఇందులో పెద్ద విశేషం ఉండ‌దు. ఇక హీరోయిన్లు కూడా వ‌య‌స్సులో త‌మ‌కంటే చిన్నోళ్ల‌నే ప్రేమించి పెళ్లాడుతున్నారు. ఇది పెద్ద విశేషం కాదు. కానీ పెళ్ల‌య్యి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా కూడా భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసి.. వ‌య‌స్సులో త‌న‌కంటే 12 ఏళ్లు చిన్నోడుతో డేటింగ్‌లు… అది కూడా 48 ఏళ్ల వ‌య‌స్సులో బీచ్‌ల్లో బికినీలు వేసుకుని చేసే హంగామా, ర‌చ్చ మామూలుగా లేక‌పోతే ఈ స్టోరీ అంతా మ‌లైకా అరోరా గురించే..!

మ‌లైకా వ‌య‌స్సు 48 ఏళ్లు, కానీ బీచ్‌ల్లో బికినీలు వేసుకుని అర్జున్ క‌పూర్‌కు ఘాటుగా లిప్‌కిస్‌లు ఇస్తూ ఆమె చేసే హంగామా, ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇక సోష‌ల్ మీడియాలో అయితే అర్జున్‌ను గ‌ట్టిగా వాటేసుకుని తెగ ముద్దులు కురిపించేస్తూ ఉంటుంది. ఇక త‌న బాడీని ఒంపుసొంపులు తిప్పేస్తూ ఇప్ప‌ట‌కీ కుర్ర హీరోయిన్ల‌కు పోటీగా ఉంటాన‌ని అనిపించుకునేలా ఉంటోంది.

రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం షారుక్ ఖాన్ దిల్ సే సినిమాతో చ‌లి చ‌య్యా చ‌య్యా సినిమాతో రైలు పై న‌డుం ఊపేస్తూ ఒంపు సొంపుల‌తో దేశ‌వ్యాప్తంగానే కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపేసింది. ఆ త‌ర్వాత కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరు 18 ఏళ్లు కలిసున్న తర్వాత ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక కూడా విడిపోయారు. వీరు విడిపోవ‌డానికి మ‌రే కార‌ణం లేదు. మ‌లైకా అర్జున్ క‌పూర్ మాయ‌లో ప‌డిపోవ‌డ‌మే…!

మ‌లైకా వ‌య‌స్సు 48.. అర్జున్ క‌పూర్ వ‌య‌స్సు 36. అంటే 12 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. ఇంత గ్యాప్ ఉండ‌డంతో త‌ర‌చూ వీరి రిలేష‌న్స్‌పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ న‌డుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మ‌లైకాకు ఇదే ప్ర‌శ్న ఎదురైంది. 12 ఏళ్ల చిన్నోడితో డేటింగ్ ఏంట‌న్న ప్ర‌శ్న‌పై మ‌లైకా ఘాటుగా స్పందించింది. మ‌న స‌మాజంలో చిన్న వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తితో డేటింగ్ చేయ‌డాన్ని ఎందుకు ? త‌ప్పుగా చూస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని మ‌లైకా చెప్పింది.

 

అస‌లు తాను ఇలాంటి వాటిని ప‌ట్టించుకోన‌ని… ప్రేమ‌కు వ‌య‌స్సుతో సంబంధం లేదన్న విష‌యాన్ని అంద‌రూ గుర్తించాలి. ఏదేమైనా తాను అర్జున్‌తో డేటింగ్ చేయ‌డంపై ఎన్ని రూమ‌ర్లు వ‌చ్చినా తాను ఏ మాత్రం ప‌ట్టించుకోన‌ని మ‌లైకా చెప్ప‌క‌నే చెప్పేసింది. ఇక ప‌ది రోజుల క్రిత‌మే వీరిద్ద‌రు బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఇద్ద‌రూ పోస్టులు పెట్టి మ‌రీ క్లారిటీ ఇస్తూ వాటిని కొట్టిప‌డేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news