బాలీవుడ్ జంట కొద్ది రోజులుగా ప్రేమ పక్షుల్లా ఎక్కడ చూసినా విహరిస్తూ వచ్చారు కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా. కొన్నాళ్లుగానే వీరిద్దరు సీరియస్ డేటింగ్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ జంట హడావిడే కనిపించేది. వీరిద్దరు సీరియస్ ప్రేమ పేరుతో దేశం మొత్తం తిరిగేశారు. ముంబైలో అయితే అసలు ఈ జంట చక్కెర్లు కొట్టని ప్లేస్ లేదు. మాల్దీవుల్లో వెకేషన్… షార్జా, యూరప్ కంట్రీస్ ఇలా ఇష్టం వచ్చినట్టు చక్కెర్లు కొట్టారు.
అసలు వీరిద్దరి రొమాంటిక్ డేటింగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కర్షనే నడిచేది. అసలు వీరి బంధం ఫెవికాల్‌ను మించిపోయి ఉండేది. వీరిద్దరు జంటగా నటించిన షేర్షా సినిమా తర్వాత వీరు మరింత స్ట్రాంగ్‌గా అతుక్కుపోయి ఉన్నారు. వీరిద్దరు రీల్ కఫుల్స్‌గా మాత్రమే కాదు.. రియల్ కఫుల్స్‌గా మారింతే మరింత బాగుంటుందనే అందరూ అనుకున్నారు. వీరి ప్రేమ చూసి అదే జరుగుతుందని భావించారు.
బాలీవుడ్లో కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్, అలియా భట్ – రణబీర్ కపూర్ తర్వాత పెళ్లి చేసుకునే జంట ఇదేనంటూ రెండు, మూడు రోజుల క్రితం సైతం వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ బంధం తెగిపోయిందన్న వార్తలు బీ టౌన్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే కియారా – సిద్ధార్థ్ బ్రేకప్ నిజమేనంటూ కియారా సన్నిహితులు సైతం చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
కియారా – సిద్ధార్థ్ మధ్య తీవ్రమైన మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయినట్టు తెలుస్తోంది. అయితే కియారా ఎక్కడా రాజపడేందుకే సిద్ధంగా లేదని.. కారణం ఏదైనా.. ముందుగా బ్రేకప్ చెప్పేందుకు కియారాయే రెడీ అయిపోయిందని కూడా బీ టౌన్లో ఒక్కటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరి బ్రేకప్ వార్తలపై వీరు మౌనంగానే ఉన్నారు. ఎవ్వరూ కూడా స్పందించడం లేదు.
ఇక వృత్తిపరంగా చూస్తే ఇద్దరూ బిజీగానే ఉన్నారు. కియరా అటు బాలీవుడ్ సినిమాలతో పాటు ఇటు సౌత్ సినిమాలు కూడా చేస్తోంది. తెలుగులో మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా చేసిన భరత్ అనే నేను సినిమాలో మనోడికి ప్రేయసిగా నటించింది. తర్వాత రామ్‌చరణ్‌తో వినయ విధేయ రామ.. ఇప్పుడు చెర్రీ – శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది.