మహేష్‌బాబు కెరీర్ బాగా డౌన్‌లోకి వెళ్లిపోవడం.. ఆ తర్వాత ఒక్క సూపర్ హిట్ తిరిగి స్వింగ్‌లోకి రావడం చాలా సార్లు జరిగింది. రాజకుమారుడుతో మహేష్ హీరో అయినా ఒక్కడు సినిమాతోనే మనోడికి సూపర్‌స్టార్ డమ్ వచ్చింది. ఒక్కడు సినిమా మహేష్‌బాబును ఆకాశంలోకి తీసుకువెళ్లింది. ఆ తర్వాత అన్ని ప్లాపులే.. పోకిరితో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే అతిథి సినిమా డిజాస్టర్ అయ్యాక మూడున్నరేళ్లు అస్సలు సినిమాలు చేయలేదు.
2007 చివర్లో వచ్చిన అతిథి ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత 2008 – 2009 కేలండర్ ఇయర్స్ మహేష్ కెరీర్‌లో ఖాళీగా ఉండిపోయాయి. 2010 అక్టోబర్లో కాని మళ్లీ మహేష్ సినిమా రాలేదు. ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. అంటే పోకిరి తర్వాత నాలుగేళ్ల పాటు మూడేళ్లు ఖాళీ.. మధ్యలో చేసిన సినిమాలు కూడా డిజాస్టర్. మహేష్ ఫ్యాన్స్ కూడా బాగా డిజప్పాయింట్ అయిపోయి ఉన్నారు.
ఆ టైంలో 2010 చివర్లో వచ్చిన దూకుడు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో మళ్లీ మహేష్‌కు ఐదారేళ్ల తర్వాత పునర్వైభవం వచ్చింది. దూకుడు తిరుగులేని బ్లాక్బబస్టర్ అవ్వడం ఒక ఎత్తు అయితే.. మహేష్‌లో కామెడీ టైమింగ్ కూడా ఫ్రూవ్ చేసింది. ఈ క్రెడిట్ ఖచ్చితంగా దర్శకుడు శ్రీను వైట్లకే చెందుతుంది. అసలు దూకుడు సినిమా ఎలా ? పుట్టింది ? ఈ సినిమా వెనక ఉన్న స్టోరీ ఏంటో శ్రీను వైట్లయే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
శ్రీను వైట్ల మహేష్ సోదరి మంజుల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే ఆమెతో సినిమా చేయాలనుకున్నప్పుడు హీరో ఎవరు ? అన్న ప్రశ్న రాగానే మంజులయే ఎవరో ఎందుకు మహేష్‌బాబుతో చేద్దాం అన్నారట. మహేష్ కూడా శ్రీను వైట్ల సినిమాలు చూసి ఉండడంతో వెంటనే మహేష్ ఓకే చెప్పేశారట. అయితే శ్రీను వైట్ల తన స్వార్థం చూసుకుని ఈ ప్రాజెక్టును 14 రీల్స్ వాళ్ల కోసం ఆ బ్యానర్లోకి మార్పించారు.
ముందుగా గోపీ మోహన్ రాసుకున్న స్టోరీని సినిమాగా తీయాలని అనుకున్నారట. అయితే ఆ కథ శ్రీను వైట్లకు నచ్చలేదట. సడెన్‌గా ఓ రోజు మహేష్ దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని నేరుగా ఆయనతోనే సార్ మనం కథతో సినిమా చేయట్లేదని చెప్పడంతో వెంటనే మహేష్ థ్యాంక్స్ శ్రీను గారు.. నేనే ఆ విషయం మీతో చెప్పాలని అనుకున్నాను.. నాకు కూడా ఈ కథ ఏతో తేడా కొడుతోందని అనిపిస్తుందని అన్నారట.
ఆ తర్వాత హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి. జనార్థన్ రెడ్డి జీవితంలో కొన్నివిషయాలు తీసుకుని.. ఆయనను ప్రజలు ఎలా దేవుడిగా కొలుస్తారు.. అన్న కోణం నుంచి ఓ లైన్ రెడీ చేసుకున్నారట శ్రీను వైట్ల. తర్వాత అదే లైన్‌ను గోపీమోహన్‌తో కలిసి డవలప్ చేశారట. ఈ కథ విన్న మహేష్ పెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్.. అన్ బిలీవబుల్ అన్న డైలాగ్ వేశారట. తర్వాత ఇదే డైలాగ్‌ను తాను సినిమాలో కూడా వాడుకున్నానని శ్రీను వైట్ల చెప్పారు. అలా దూకుడు కథ పుట్టడం.. బ్లాక్‌బస్టర్ కొట్టడం జరిగిపోయాయి.