మహేష్‌బాబు నైజం వేరు.. ఓ డైరెక్టర్‌ను నమ్మాడంటే అసలు కథ కూడా వినకుండానే డేట్లు ఇచ్చేస్తాడు.. సినిమాకు ఓకే చెప్పేస్తాడు. అయితే ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఏదైనా డైరెక్టర్‌తో ఆయనకు తేడా వచ్చింది అంటే వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. ఉదాహరణకు ఒక్కడు సినిమాకు ముందు వరకు మహేష్‌బాబు కెరీర్ పడుతూ లేస్తూ వస్తోంది. అంతకు ముందు బాబి డిజాస్టర్. మహేష్ అభిమానులు కూడా తమ హీరోకు తిరుగులేని బ్లాక్‌బస్టర్ పడాలని బలంగా కోరుకుంటున్నారు. అలాంటి టైంలో 2003 సంక్రాంతి కానుకగా వచ్చిన ఒక్కడు సినిమా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఏకంగా 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడి మహేష్‌ను తిరుగులేని సూపర్‌స్టార్‌ను చేసింది.
ఆ ఒక్కడు నమ్మకంతోనే గుణశేఖర్‌ను పూర్తిగా నమ్మి మరో రెండు సినిమాలు అర్జున్, సైనికుడుకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక దూకుడు సినిమాకు ముందు ఖలేజా ప్లాప్. అంతకు ముందే మూడేళ్లు ఖాళీ. ఆ టైంలో వచ్చిన దూకుడు బ్లాక్‌బస్టర్ అవ్వడంతో పాటు మహేష్‌లో కొత్త కామెడీని ఆవిష్కరించింది. ఆ కృతజ్ఞతతోనే అసలు కథ కూడా వినకుండానే శ్రీను వైట్లకు ఆగడు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అది వేరే సంగతి.
ఇక తనకు సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి మల్టీస్టారర్ ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ ఇచ్చాడనే శ్రీకాంత్ అడ్డాలకు బ్రహ్మోత్సవం ఆఫర్ ఇచ్చాడు. ఆ సినిమా కథ కూడా మొత్తం వినలేదు. శ్రీమంతుడు సినిమా క్లైమాక్స్ జరుగుతుండగా ఆ సెట్‌కు వెళ్లిన శ్రీకాంత్ ఫ్యామిలీ కథ సార్ అని చెప్పిన వెంటనే పూర్తి కథ వినకుండా ఓకే చెప్పేసి షూటింగ్ వెళ్లిపోదామన్నాడట. అయితే ఆ సినిమా షూటింగ్ సగం అయ్యాక దర్శకుడు సినిమాను ఎటు తీస్తున్నాడో ? ఏ సీన్ ఎటు పోతోందో కూడా మహేష్‌కే అర్థం కాలేదట.
దీంతో మహేష్‌కు చిర్రెత్తుకొచ్చి కేకలు వేయడంతో అప్పుడు గాని కథ రెడీ కాలేదని.. శ్రీకాంత్ ఏ రోజు సీన్లు ఆ రోజు రాసుకువచ్చి సూట్ చేస్తున్నాడని అర్థమైందట. దీంతో ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందుగా అర్థమైనా నిర్మాతలు నష్టపోకూడదని అయిష్టంతోనే పూర్తి చేశాడు. చివరకు మహేష్ అంచనా తప్పలేదు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవ్వడమే కాదు.. మహేష్ పరువు మొత్తం తీసేసింది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల అనే వ్యక్తి తనను కలిసేందుకు కూడా ఇష్టపడనంతగా మహేష్ కోపం పెట్టుకున్నాడన్నది ఇండస్ట్రీ టాక్ ?
ఇక మహేష్‌కు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వివి. వినాయక్‌తో కూడా కొంత గ్యాప్ ఉందన్నది ఇండస్ట్రీలో వినిపించే మాట. వినాయక్ ఆది, చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్ ఇలా వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ టైంలో మహేష్‌బాబును కలిసి కథ చెపితే నచ్చలేదని చెప్పాడట. అయితే వినాయక్ తన కథ మహేష్‌కు నచ్చలేదట అని ఇండస్ట్రీలో తన క్లోజ్ సర్కిల్స్‌తో చెప్పడం.. ఆ మాట మహేష్ చెవిలో పడడంతో ఆ తర్వాత అసలు వినాయక్‌కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదట. ఇక ఇప్పుడు వినాయక్ ఫామ్‌లో లేడు.. మహేష్ మామూలుగా ఏమో గాని.. సినిమా కథ వినేందుకు ఖచ్చితంగా టైం ఇవ్వడు. అలా ఈ ఇద్దరు దర్శకులను మహేష్ శాశ్వతంగా దూరం పెట్టేసినట్టే అన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్ ?