కన్నడ సోయగం కృతి శెట్టి. అబ్బో..అమ్మడు క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. అందానికి అందం..నటనకి నటన..స్టార్ హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోని విధంగా..ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు గోల్డెన్ లెగ్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా కృతి శెట్టి మాత్రమే అంటున్నారు జనాలు. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ భామ.. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతలా ఆమె తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. ఏళ్లకేళ్లు వేచి చూసినా కూడా రాని ఇమేజ్ మూడు సినిమాలతోనే తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ అంటే అమ్మదు లోని టాలెంట్ ను డైరెక్టర్లు టక్కున పట్టేసారు అనాల్సిందే.
ఇప్పటి వరకు కృతి చేసింది మూడు సినిమాలే. కానీ..ఆమె ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రజెంట్ ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య తో ఓ సినిమాకు సైన్ చేసి..అక్కడ లక్ ను పరీక్షించేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు అవ్స్తున్నాయి. త్వరలోనే అక్కడ కూడా పాగ వేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే, తాజాగా అమ్మడు అభిమానులతో ముచ్చటించింది. ఈ చిట్ చాట్ లో తన మనసులోని కోరిక చెప్పేసింది.
కృతి కి భిన్నమైన క్యారెక్టర్లు లభించడం వల్లే తాను ఇప్పుడు ఈ పోజీషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కృతి శెట్టి మాట్లాడుతూ…”నాకు ఎప్పుడు ఒకే క్యారెక్టర్స్ చేయడం ఇష్టం ఉండదు. నేను ప్రతిసారీ కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్న. అలాంటి కధలనే చూస్ చేసుకుంటున్నా. నా దగ్గరకొచ్చే కథల్లో గత చిత్రాలను పోలినవి లాగా అనిపించినవి వద్దని చెప్పేస్తా.
నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే.. సవాలు విసిరే క్యారెక్టర్ లల్లోనే కనిపించాలి. అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది. త్వరలో సొంత డబ్బింగ్ చెప్పుకోవాలనీ అనుకుంటున్నా. మాకు రాకుమారి పాత్రలో నటించాలని ఉంది. అది ఎప్పటికి తీరుతుందో చూడాలి’ అని చెప్పింది. ప్రస్తుతం కృతి శెట్టి సుధీర్ బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్ సరసన ‘ద వారియర్’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.