Movies"KGF2"@ 13Days: మాస్ వీరంగం అంటే ఇదే.. కుమ్మేశాడ్రా బాబు..ఎన్ని కోట్లు...

“KGF2″@ 13Days: మాస్ వీరంగం అంటే ఇదే.. కుమ్మేశాడ్రా బాబు..ఎన్ని కోట్లు రాబట్టిందంటే..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో యశ్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’. ఇటీవల రిలీజ్ అయ్యిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. క‌న్న‌డ ఖ్ఘ్F చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఖ్ఘ్F 2 సినిమా మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చి ఎట్ట‌కేల‌కు ఈ నెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మాస్ వర్గాలను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. భారీ పాన్ ఇండియా లెవ‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా నార్త్ లేదు సౌత్ లేదు.. ఓవ‌ర్సీస్ లేదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా వ‌సూళ్ల దుమ్ము రేపుతోంది.


అస‌లు ఈ సినిమా ఇప్ప‌టికే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోగా.. ఏ స్థాయి విజ‌యం సాధిస్తుంద‌న్న‌ది మాత్రం అంచ‌నాల‌కు అంద‌డం లేదు. ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాక‌ట, త‌మిళ‌నాడు, కేర‌ళ‌.. అటు నార్త్‌లో హిందీ బెల్ట్ అంతా కేజీయ‌ఫ్ 2 మాయ‌లో మునిగి తేలుతోంది. ఇక ఈ సినిమాలో యశ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. సినిమా చూసిన వారిని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న టేకింగ్‌తో క‌ట్టిప‌డేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశాంత్ డైరెక్షన్ ని పొగిడేస్తున్నారు. అంతేబా.. ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక కేజీయ‌ఫ్ 2 సినిమా కలెక్షన్స్ పరంగా కూడా .. బాక్స్ ఆఫిస్ రికార్డులను తిరగరాస్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మొదటి రో జే రు. 165 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా..ఇప్పుడు అనగ 13 వ రోజు ..కళ్లు చెదిరే కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా 13 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.466.25కోట్ల షేర్ (రూ. 942.75 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసింది.

ఇక 13 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
——————————————–
నైజాం (తెలంగాణ): రూ. 39.08కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 10.54 కోట్లు /రూ. 14 కోట్లు

కృష్ణా: రూ. 3.81 కోట్లు / రూ. 6కోట్లు

నెల్లూరు:రూ. 2.55 కోట్లు / రూ. 3 కోట్లు

వెస్ట్: రూ. 3.22 కోట్లు రూ. 6 కోట్లు

గుంటూరు: రూ. 4.21 కోట్లు / రూ. 7 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 6.89 కోట్లు / రూ. 10 కోట్లు

ఈస్ట్: రూ. 5.15 కోట్లు / రూ. 7 కోట్లు
———————————————————
తెలుగు రాష్ట్రాల్లో రూ. 75.45 కోట్లు షేర్ (రూ. 121.30 కోట్లు గ్రాస్) రాబట్టింది.
———————————————————–

ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..
——————————————————–

తెలుగు : రూ. 75.45 కోట్లు (119.70 కోట్లు గ్రాస్ ) / రూ. 78 కోట్లు

తమిళ్ : రూ.35.85 కోట్లు (రూ. 70.25 కోట్లు గ్రాస్) / రూ. 27 కోట్లు

కర్ణాటక : రూ. 83.25 కోట్లు (రూ. 141.50 కోట్లు గ్రాస్ ) / రూ. 100 కోట్లు

హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 169.35 కోట్లు (రూ. 389.05 కోట్లు గ్రాస్) / రూ. 100 కోట్లు

కేరళ : రూ. 24.05 కోట్లు (51.45 కోట్లు గ్రాస్ ) / రూ. 10 కోట్లు

ఓవర్సీస్ : రూ. 78.30 కోట్లు (రూ. 153.40 కోట్లు) / రూ. 30 కోట్లు
————————————————————————————
టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 466.25 కోట్లు (రూ. 942.75 కోట్ల గ్రాస్) వసూళు చేసింది.
———————————————————————————-

ఓవరాల్‌గా 13వ రోజు బాక్సాఫీస్ దగ్గర 8.52 కోట్ల షేర్ ( 17.40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news