2018 చివర్లో వచ్చిన కన్నడ మూవీ కేజీయఫ్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఆ సినిమా కన్నడ బాహుబలిగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసిన యశ్ ఈ సినిమా దెబ్బతో రాకింగ్ స్టార్ అయిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కేజీయఫ్ దెబ్బతో కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం చూసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీయఫ్ 2 తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీయఫ్ 2 ఎలా ఉందో TL సమీక్షలో చూద్దాం.
కథ:
కేజీయఫ్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుంచి కేజీయఫ్ 2 స్టార్ట్ అవుతుంది. రాకీ బాయ్ (యశ్) గరుడను చంపడంతో కేజీయఫ్ 1 ముగుస్తుంది. రాకీ గరుడను చంపడంతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోతాడు. ఆ సమయంలో భారత ప్రధానమంత్రి రమ్మిక సేన్ ( రవీనా టాండన్)కు కేజీయఫ్‌లో ఉన్న నిధుల గురించి తెలుస్తోంది. కేజీయఫ్‌ను తన గుప్పిట్లో పెట్టుకునే క్రమంలోనే ఆమె అధీరా ( సంజయ్‌దత్) తో తలపడాలని డిసైడ్ అవుతుంది. అయితే అధీరా బలం తెలుసుకున్న ఆమె అందుకోసం ఓ ధైర్యవంతుడు కావాలన్న నిర్ణయానికి వస్తుంది. అలా రాకీబాయ్‌ను ఆమె యుద్ధానికి దింపుతుంది. ఈ సమరంలో రాకీ అటు అధీరాతో పాటు భారత ప్రభుత్వంపై ఎలా పోరాడాడు ? అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
కేజీయఫ్ 1లో యశ్ ఎలాగైతే హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడో ఈ సినిమాలో అంతకు మించిన హీరోయిజం ఎలివేట్ అయ్యింది. అసలు యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే యశ్ నటన చూస్తే ఒళ్లు గగుర్పొడిచేస్తుంది. గూస్‌బంప్స్ వచ్చేస్తాయి. అంతేకాకుండా ప్రకాష్‌రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ వీళ్ల పాత్రలు అన్ని చాప్టర్ 2లో హైలెట్‌గా నిలిచాయి. ప్రతి ఒక్క నటుడు తమ పాత్రకు న్యాయం చేశాడనే చెప్పాలి.
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన హై లెవల్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మైండ్‌బ్లాక్ చేసేస్తాయి. యాక్షన్ ప్రియులు అయితే ఈ సినిమాను రిపీటెడ్‌గా చూసేందుకే ఇష్టపడతారు. ఇక హోంబలే ఫిలింస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మైనస్‌ల విషయానికి వస్తే పార్ట్ 1తో పోలిస్తే వీక్‌గా ఉన్న స్టోరీ… స్క్రీన్ ప్లే కన్‌ప్యూజింగ్‌గా ఉండడం.. అధీరాకు యశ్‌కు మధ్య వార్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త స్లో అవ్వడం ఇబ్బంది పెడతాయి. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సినిమాను ర్యాంప్ ఆడేశాడు ప్రశాంత్ నీల్ అని చెప్పాలి.
సినిమా ఫస్టాఫ్ వరకు చూస్తే చాలా సూపర్బ్‌గా ఉంది. ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంది. యష్ స్టైలిష్ గా కనిపిస్తాడు. అయితే కేజీయఫ్ 1లో కథతో పాటు ఎమోషన్, యాక్షన్ అదిరిపోతుంది. పార్ట్ 2లో మాత్రం యాక్షన్ సీక్వెన్స్ డామినేషన్ బాగా ఉంది. కథ పరంగా కాస్త తగ్గిందా ? అనిపిస్తుంది. హీరోయిజం ఎలివేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
హీరోయిజం అయితే ఓవర్ ది టాప్‌లో ఉంటుంది. అసలు కొన్ని షాట్స్ చూస్తుంటే మతిపోయేలా ఉన్నాయి. అసలు సినిమాలో చాలా హైలెట్స్ ఉంటాయి. రాకీ భాయ్ ఇంట్రడక్షన్, అధీర ఎంట్రన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్.. ఇంటర్వెల్ తర్వాత మైండ్ బ్లాకింగ్ సీక్వెన్స్.. క్లైమాక్స్ అసలు ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా మార్చేశాయి. అయితే ఓ ప్రధానమంత్రిని హెచ్చరించేందుకు రాకీ నేరుగా పీఎంవోకు వెళ్లడం.. ఓ రాజకీయ నేతను చంపేందుకు రాకీ నేరుగా పార్లమెంటు హాలులోకి వెళ్లడం మరీ ఓవర్ అనిపించేలా ఉంది. అయితే కథాగమనంలో ఇవి పెద్దగా పట్టించుకోడు ప్రేక్షకుడు.
ఫైనల్‌గా…
రాకీ బాయ్ విశ్వరూపం
కేజీయఫ్ 2 TL రేటింగ్: 3.25 / 5