కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా వండర్ కేజీయఫ్ 2. అసలు ఈ సినిమా ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయిపోగా.. ఏ స్థాయి విజయం సాధిస్తుందన్నది మాత్రం అంచనాలకు అందడం లేదు. కేజీయఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ కావడంతో అదే అంచనాలకు మించి 2 థియేటర్లలోకి వచ్చింది. సౌత్ లేదు నార్త్ లేదు… ఏపీ, తెలంగాణ, కర్నాకట, తమిళనాడు, కేరళ.. అటు నార్త్‌లో హిందీ బెల్ట్ అంతా కేజీయఫ్ 2 మాయలో మునిగి తేలుతోంది.
4 రోజుల్లోనే కేజీయఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా రు. 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇక 5 రోజులు ముగిసే సరికి కేజీయఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా రు. 625 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఐదు రోజులకే ఈ రేంజ్ వసూళ్లు అంటే ఇండియన్ సినిమా అంతా ఈ సినిమా మానియాలో ఎలా మునిగిపోయిందో తెలుస్తోంది. కేవలం 5 రోజులకే ఇండియన్ సినిమా వైడ్‌గా టాప్ – 10 వసూళ్లు సాధించిన జాబితాలో ఈ సినిమా చేరిపోయింది.
5 రోజుల ఏరియా వైజ్ వసూళ్లు ఓ సారి చూస్తే… ( రూ. కోట్లలో)
నైజాం – 30.63
సీడెడ్ – 8.17
ఉత్తరాంధ్ర – 5.34
ఈస్ట్ – 3.98
వెస్ట్ – 2.43
గుంటూరు – 3.25
కృష్ణా – 2.92
నెల్లూరు – 1.94
————————————————————
ఏపీ + తెలంగాణ = 58.66 ( షేర్ ) ( 93 కోట్ల గ్రాస్)
—————————————————————
కర్నాటక – 58.60
తమిళనాడు – 18.25
కేరళ – 14.20
హిందీ – 110
ఓవర్సీస్ – 51.40
——————————————-
వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ = 311.15 (షేర్)
గ్రాస్ వసూళ్లు = 625.12 కోట్లు
——————————————–
ఇక ఈ దూకుడు చూస్తుంటే కేజీయఫ్ 2 ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ రికార్డులు క్రాస్ చేసేలా ఉంది. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ జోరు తగ్గింది. ఈ సినిమా రు. 1100 కోట్లకు దగ్గర్లో ఉంది. ఇక కేజీయఫ్ స్పీడ్ అన్ని భాషల్లోనూ స్పీడ్‌గా ఉంది. పైగా ఇప్పట్లో ఈ సినిమాకు పోటీ వచ్చే సినిమాలు కూడా లేవు. త్రిబుల్ ఆర్ రికార్డు బ్రేక్ అవ్వడం పెద్ద కష్టం కాదనిపించేలా ఉంది.