గత మూడేళ్లుగా సౌత్ ఇండియా సినిమా అభిమానులకే కాకుండా దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినీ అభిమానులు అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న సినిమాలు రెండే రెండు. అందులో ఒకటి త్రిబుల్ ఆర్. రెండోది కేజీయఫ్ 2. ఈ రెండు సినిమాల్లో త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేసింది. సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో.. ఆ అంచనాలు అన్ని నిజం చేస్తూ సూపర్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఏకంగా రు. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఇక ఇప్పుడు అందరి దృష్టి పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్న కేజీయఫ్ 2 మీదే ఉన్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన కేజీయఫ్ సినిమాపై రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్నో సంచలనాలకు కేంద బిందువు అయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. కేజీయఫ్ 2 రిలీజ్ కాకుండానే ప్రశాంత్ నీల్ ఏకంగా ప్రభాస్, ఎన్టీఆర్‌లను డైరెక్ట్ చేసే బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.
అలా ఎందరో తలరాతలను మార్చేసి.. కన్నడ సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో దేశవ్యాప్తంగా చాటిచెప్పింది. ఇండియన్ సినిమా జనాలు అందరూ కేజీయఫ్‌ను కన్నడ బాహుబలి అంటూ కీర్తించారు. ఇక ఇప్పుడు సహజంగానే కేజీయఫ్ 2పై భారీ అంచనాలు ఉంటాయి. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ? ఉందో టాక్ వచ్చేసింది.
మన ఇండియన్ సినిమాలకు ముందే రివ్యూ ఇచ్చే యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు పెద్ద మెసేజ్‌ను ఈ సినిమా కోసం రాసుకువచ్చారు. కేజీయఫ్ 2 సినిమా అనేది కన్నడ ఇండస్ట్రీయే కీర్తి కిరీటం లాంటిది.. సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌డో నిండిపోయి ఉంటుందని.. సినిమా నిండా పదునైన పంచ్ డైలాగులే ఉంటాయని చెప్పారు.
ఇక మ్యూజిక్ అదిరిపోయిందని.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టిందంటూ ఆకాశానికి ఎత్తేశారు. సినిమా ఆద్యంతం ఇంటిన్సెటీ చూపించడంలో దర్శకుడు నీల్ ఎంతో పనితనం చూపించాడని మెచ్చుకున్నాడు ఉమైర్. ఇక సినిమాలో నటించిన నటీనటులు అందరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారని.. ఈ సినిమా కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితం అయిన బ్లాక్‌బస్టర్ కాదని.. ఇదో వరల్డ్ క్లాస్ మూవీ అంటా ఆకాశానికి ఎత్తేశారు.
ఇక సినిమాలో యశ్, సంజయ్‌దత్ పాత్రలు చాలా చాలా ఆకట్టుకుంటాయని.. ఇక క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరికి ఎంతో షాక్ ఇస్తుందని.. ఇంత షాకింగ్ ట్విస్ట్ మనం ఊహించలేమని కూడా ఉమైర్ చెప్పాడు. ఓవరాల్‌గా సినిమా అంతా మీకు గూస్ బంప్సే అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద స్టోరీ పెట్టాడు ఉమైర్. మరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ నెల 14న తేలిపోనుంది.