Moviesక‌త్రినా కైఫ్ కొత్త ఫొటో స్టోరీ.. వావ్ ఈ వ‌య‌స్సులో ఇంత...

క‌త్రినా కైఫ్ కొత్త ఫొటో స్టోరీ.. వావ్ ఈ వ‌య‌స్సులో ఇంత అంద‌మా.. పాల‌రాతి శిల్ప‌మా..!

క‌త్రినా కైఫ్ సినిమాల్లోకి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు అవుతోంది. 2003 స్టార్టింగ్‌లో బాలీవుడ్‌లోకి బూమ్ సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రెండు ద‌శాబ్దాలుగా సినిమా కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ వ‌చ్చిన క‌త్రినా ఒకానొక టైంలో అయితే బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె బాలీవుడ్‌లోకి వ‌చ్చిన యేడాదికే తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్‌కు జోడీగా మ‌ల్లేశ్వ‌రి సినిమాలోనూ న‌టించింది. ఆ త‌ర్వాత బాల‌య్య ప‌క్క‌న అల్ల‌రి పిడుగు సినిమాలోనూ జోడీ క‌ట్టింది.

ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూ హిట్లు మీద హిట్లు కొట్టింది. ఆ టైంలో ఆమె దేశంలోనే టాప్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా రికార్డుల్లో నిలిచింది. ఆ త‌ర్వాత కొంద‌రు స్టార్ హీరోల‌తో ఎఫైర్ల వార్త‌ల‌తోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ క‌త్రినాను ఎంత‌గా ఎంక‌రేజ్ చేశాడో…. త‌న సినిమాల్లో ఛాన్సులు ఇవ్వ‌డంతో పాటు ఇత‌ర స్టార్ హీరోల సినిమాల కోసం ఆమెను ఎంత‌గా రిక‌మెండ్ చేశాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అందం విష‌యంలో దేశ‌వ్యాప్తంగా కుర్ర‌కారును క‌త్రినా ఎంతో ఊపేసింది. ఆమెకు సోష‌ల్ మీడియాలో ఏకంగా 67 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారంటేనే ఆమె అందాన్ని ప్రేమించే కుర్రాళ్లు దేశ‌వ్యాప్తంగాను, ప్ర‌పంచ వ్యాప్తంగాను ఎంత మంది ఉన్నారో తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె వ‌య‌స్సు నాలుగు పదుల‌కు చేరువ అవుతోంది. తాజాగా ఆమె వ‌య‌స్సులో త‌న కంటే చిన్నోడు అయిన విక్కీ కౌశ‌ల్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

త‌న‌కంటే చిన్నోడిని పెళ్లాడ‌డ‌మే కాదు.. ఇటు ఆన్ స్క్రీన్ మీద కూడా త‌న కంటే చాలా చిన్న వ‌య‌స్సు ఉన్న హీరోల‌తో కూడా పోటీ ప‌డుతూ రొమాన్స్ చేసేంత అందంతో క‌త్రినా ఊరిస్తోంది. అస‌లు ఆమె మ‌రో ద‌శాబ్దం పాటు ఇంతే చెక్కు చెద‌ర‌ని అందంతో ఊరించేలా ఉంది. ఆమె తాజా ఫొటో నెట్టింల్లో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.

స‌ముద్రం ఒడ్డున బ్లూ టాప్ వేసుకుని… కురులు విర‌బూసుకుని.. ఆ అలల హోరులో త‌దేకంగా చూస్తోన్న ఆ స్టిల్‌లో చూస్తుంటే ఈ వ‌య‌స్సులో కూడా ఈ పాల‌రాతి శిల్పానికి ఇంత అందం ఏంట్రా బాబు అని పిచెక్కిపోయేలా ఉంది. ఈ పిక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news