మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన సినిమా ఆచార్య. కెరీర్లోనే తొలిసారిగా తండ్రి చిరంజీవి.. కొడుకు రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో పాటు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ఆచార్యపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్యలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్‌ను ముందు హీరోయిన్ గా ఎంపిక చేశారు. సిద్ధా పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది.
తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కాజల్ అగర్వాల్ పాత్ర లేకపోవడంతో అసలు కాజల్ సినిమాలా ఉందా ? లేదా అన్న సందేహాలు చాలా మందికి కలిగాయి. కాజల్ పాత్రను కావాలనే రివీల్ చేయలేదని కొందరు భావించారు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేసింది. ముందుగా చిరుకు జోడీగా కాజల్ ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడడంతో పాటు.. అదే సమయంలో కాజల్ గర్భవతి కావడంతో ఆమె పాత్రపై నాలుగైదు రోజులు షూటింగ్ చేసి ఆపేశారట.
అయితే ఆమె పాత్ర ఉందనే ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కొరటాల క్లారిటీ ఇచ్చేశారు. ఆచార్య నుంచి కాజల్ పాత్ర కట్ చేసినట్టు ఆయన చెప్పారు. నాలుగైదు రోజులు షూటింగ్ అయ్యాక కాజల్ పాత్రను కథతో సంబంధం లేకుండా బలవంతంగా ఇరికించడం కరెక్ట్ కాదని.. తాను చిరంజీవితో పాటు కాజల్‌కు కూడా చెప్పినట్టు ఆయన అన్నారు. కాజల్ ఈ విషయం చెప్పిన వెంటనే నవ్వి ఓకే చెప్పిందని కొరటాల తెలిపారు.
సో కాజల్ తప్పుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాలో ఒకే ఒక్క హీరోయిన్‌గా పూజా హెగ్డే మాత్రమే కనిపించనుందన్నది క్లారిటీ వచ్చింది. అయితే లాహే లాహే సాంగ్‌లో కాజల్ స్టెప్పులు వేసింది. మరి ఈ పాటలో అయినా ఆమె ఉందా ? లేదా ? అన్నది కూడా సినిమా చూసి తెలుసుకోవాలని కొరటాల చెపుతున్నారు. అయితే కాజల్ పాత్ర లేదు.. సినిమాలో రెజీనా ఐటెం సాంగ్‌లో చిరుకు జోడీగా నటించింది.
ఆమె పాత్ర చిరంజీవితో పాటు కొన్ని సీన్ల వరకు ట్రావెల్ అవుతుందని తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఈ సినిమాలో చిరుకు జోడీగా కొంత వరకు అయినా కనిపించేది రెజీనా అని మాత్రమే తెలుస్తోంది. రెజీనాది ధర్మస్థలిలో ఉండే పాత్ర అని అంటున్నారు. మరి ఈ ప్రశ్నలకు రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఆన్సర్లు రానున్నాయి. ఈ శుక్రవారమే ఆచార్య థియేటర్లలోకి వస్తోంది.