టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడు సంవత్సరాల పాటు ఊరించి ఊరించి వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ పై ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో మనం చూశాం. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో భారత దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది.
ఇప్పుడు తెలుగు సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ రూ. 500 కోట్లతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందని స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి పై తన గురువు రాఘవేంద్ర రావు ఇంపాక్ట్ గట్టిగా ఉండబోతోందని తెలుస్తోంది. మహేష్‌తో రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమాలో అడవి జంతువులు కూడా భారీగా ఉంటాయట. మనదేశంలో జంతువులను సినిమాల్లో వాడటంతో పాటు… జంతువులను ఇబ్బంది పెట్టడం నిషేధం.
అందుకే ఈ సినిమా షూటింగును ఆఫ్రికాలోని అడవుల్లో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. సెట్స్ లేకుండా ఈ సినిమా షూటింగ్ అడవుల్లో జరుపుకోనుంది. గతంలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన అడవిరాముడు లాగా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు సినిమా కర్ణాటక అడవుల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో అడవి జంతువులను ఉపయోగించారు.
ఇప్పుడు మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా ఎన్టీఆర్ అడవి రాముడు స్టైల్ లోనే ఉంటుందని అంటున్నారు. ఆ సినిమా నుంచి ప్రేరణ పొందే రాజమౌళి – మహేష్ బాబు సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2022 దసరా నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా దాదాపు ఏడాదిన్నర పాటు షూటింగ్ జరుపుకోనుంది. 2024 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.