తెలుగు సినిమాలకే కాదు.. ఏ సినిమా రంగంలో అయినా సెంటిమెంట్ల గురించి ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది. అది ఏ సెంటిమెంట్ అయినా… కొన్నేళ్ల పాటు పూజా హెగ్డే సౌత్ సినిమాను ఏలేస్తోంది. అసలు ఆమెకు ఫేమ్ వచ్చిందే సౌత్ సినిమాతో.. ! ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాతో అలాంటిది ఆమె ఇప్పుడు తెలుగు సినిమానే చిన్న చూపు చూస్తోందన్న విమర్శలు అయితే వస్తున్నాయి.
తక్కువ టైంలోనే పూజ బన్నీతో రెండు సార్లు, ఎన్టీఆర్, మహేష్, వరుణ్‌తేజ్ ఇలా క్రేజీ హీరోల పక్కన జోడీ కట్టేసింది. అటు నాగచైతన్యతో, ఇటు ప్రభాస్‌తో ఆడి పాడేసింది. కొన్నాళ్ల క్రితం వరకు పూజ అంటే హీరోలకు పెద్ద సెంటిమెంట్. స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం పూజ వెంట పడి పట్టుబట్టి మరీ తమ సినిమాల్లో పెట్టుకునే వారు. ఇంకేముంది అందరూ తన వెంట పడుతూ ఉండడంతో పూజ కొండెక్కి కూర్చొంది. తాను అడిగినంత ఇవ్వాలనే కండీషన్లు పెట్టేసింది.
త్రివిక్రముడు అంతటి వాడే అల వైకుంఠపురంలో, అరవింద సమేత, ఇప్పుడు మహేష్‌బాబు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. రు. 50 లక్షల నుంచి రెండేళ్లలో ఆమె రు. 3 కోట్ల రేంజ్‌కు వెళ్లిపోయింది. అంతెందుకు ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం పూజా కాజా అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. పూజ అడుగు పెడితే చాలు సినిమా హిట్ అని దిల్ రాజు మైకు పట్టుకుని మరీ ఊదరకొట్టేశాడు.
అయితే ఇప్పుడు పూజ అంటేనే ఐరెన్‌లెగ్ అంటున్నారు. రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో ఆమె తీరుకు ప్రభాస్ విసిగిపోయి ఆమెతో మాట్లాడలేదు. ప్రమోషన్లలో కూడా ఇదే కనిపించింది. ఇక నిన్నటి వరకు గోల్డెన్ లెగ్ అయిన పూజ ఇప్పుడు ఐరెన్ లెగ్ అయిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఆమె నటించిన రాధేశ్యామ్ ఘోరాతి ఘోరమైన ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి అయ్యింది.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పక్కన ఆమె నటించిన బీస్ట్ కూడా అంతే ఘోరమైన ప్లాప్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. కేజీయఫ్ దెబ్బతో బీస్ట్ ఎక్కడా అడ్రస్ లేకుండా పోతోంది. అయితే ఈ సెంటిమెంట్ ఇప్పుడు తెలుగులో ఈ నెలలో వస్తోన్న రెండు సినిమాలను టెన్షన్ పెడుతోంది. ఆచార్య సినిమాలో పూజ చెర్రీకి జోడీగా నటిస్తోంది. అటు ఎఫ్ 3 సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది.
ఇప్పుడు ఆమె జాతకం అస్సలే బాగున్నట్టు లేదు. రాధేశ్యామ్, బీస్ట్ తన్నేశాయ్. ఇదే సెంటిమెంట్ ఈ నెలలో కూడా కంటిన్యూ అయితే ఎఫ్ 3, ఆచార్య కూడా తేడా కొట్టేస్తాయన్న టెన్షన్ అయితే సెంటిమెంట్లను నమ్మే ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. మరి పూజ ఈ బ్యాడ్ సెంటిమెంట్లను ఎంత వరకు చెరిపేస్తుందో ? చూడాలి.