Moviesఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమా నుంచి మెగాస్టార్ అవుట్‌... మోహన్ బాబు...

ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమా నుంచి మెగాస్టార్ అవుట్‌… మోహన్ బాబు ఇన్‌… తెర వెనుక ఏం జరిగింది..?

టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు వచ్చినా మెగాస్టార్ చిరంజీవికి సరితూగే హీరోలు ఎవరూ లేరు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో చిరంజీవి ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. రాజకీయంగా చిరంజీవి ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ వెండితెర మీద మాత్రం చిరంజీవి ఎప్పటికీ రారాజు. తిరుగులేని మెగాస్టార్. పదేళ్లపాటు సినిమాలకు దూరమైనా ఖైదీ నెంబర్150 లాంటి రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కూడా వంద కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టిన ఘనత చిరంజీవికే మాత్రమే దక్కుతుంది. చిరంజీవి తన 40 సంవత్సరాల కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించారు. చిరంజీవి కెరీర్ లో 80 శాతం హిట్ సినిమాలే. త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో… ఎంతో మంది దర్శకులతో… ఎంతో మంది టాప్ టెక్నీషియన్ల‌తో కలిసి ఆయన పని చేశారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరు కలిసి కూడా చిరంజీవి తెర పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావుతో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించిన చిరంజీవి ఎన్టీఆర్ తో తిరుగులేని మనిషి సినిమాలో ఆయనకు బావమరిదిగా నటించారు. అయితే కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్ కొడుకు పాత్రకు ముందుగా చిరంజీవిని తీసుకున్నారు.

పాత్రపరంగా ఎన్టీఆర్‌తో విభేదిస్తూ పవర్‌ఫుల్‌గా తండ్రిని ఎదిరిస్తూ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. ఐదు రోజులు చిరంజీవిపై షూటింగ్ కూడా జరిగింది. అప్పటికే ఎన్టీఆర్ తిరుగులేని సూపర్ స్టార్. చిరంజీవి కొత్తగా సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ముందుకు నడుచుకుంటూ వస్తుంటే చిరంజీవి వెనుకకు నడుచుకుంటూ వెళ్తున్నారట. చిరంజీవి కొత్తగా సినిమాల్లోకి రావడం.. అప్పటికే ఎన్టీఆర్ టాప్ హీరోగా ఉండడంతో.. ఎన్టీఆర్‌ను ఎదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి కాస్త తటపటాయించే వారట.

అయితే ఎన్టీఆర్ ఆ సినిమాకు నెల రోజులు మాత్రమే కాల్షీట్లు ఇవ్వడంతో చిరంజీవి ఈ పాత్ర‌లో సెట్ అయ్యేందుకు టైమ్ పడుతుందని.. ఆయన స్థానంలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబును తీసుకున్నారు నిర్మాతలు. అప్పటికే మోహన్ బాబు ఎన్టీఆర్ తో సింహబలుడు సినిమాలో కలిసి విలన్ గా నటించారు. ఈ క్రమంలోనే కొండవీటి సింహం సినిమాలో కొడుకుగా ఉంటూ ఎన్టీఆర్ ని ఢీకొట్టే పాత్రలో నటించడం మోహన్ బాబుకు పెద్ద కష్టం కాలేదు.

ఎన్టీఆర్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో న‌టిస్తూ డైలాగులు చెప్ప‌డంతో పాటు ప‌వ‌ర్ ఫుల్‌గా ఆ పాత్ర‌కు న్యాయం చేశాడు. ఖచ్చితంగా కొండవీటి సింహం సినిమాలో మోహన్ బాబు అద్భుతంగా నటించడంతో పాటు డైలాగులు బాగా చెప్పారని… అంతమాత్రాన ఆయన చిరంజీవి కన్నా గొప్ప నటుడు కాడు అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ భ‌ర‌ద్వాజ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news