ఇప్పటికే సోషల్ మీడియాలో కేజీయఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ వైరల్ అవుతోంది. అసలు రవి కథ ఎంత ఇన్సిప్రేషన్‌గా ఉందో చూస్తున్నాం. ఇక ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి ఏకంగా 19 ఏళ్ల బుడ్డోడు. ఇవే ట్విస్టులు అనుకుంటే ఇప్పుడు కేజీయఫ్‌లో విలన్‌గా చేసిన గరుడ అలియాస్ రామ్ స్టోరీ కూడా మరింత ఇన్సిప్రేషన్‌గానే కనిపిస్తోంది. అసలు ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఓ డిఫరెంట్ క్యారెక్టర్. మనోడు తరచూ కేజీయఫ్ కథా చర్చల కోసం యశ్ దగ్గరకు వెళ్లేవాడు.
వాళ్లిద్దరు గంటల తరబడి ఈ సినిమా కోసం చర్చలు జరిపేవాళ్లు. తనకు సంబంధించిన డైలాగుల్లో యశ్ కొన్ని తానే రాసుకున్నాడు. యశ్ ఎక్కడా ఓ పట్టాన కన్విన్స్ కాడట. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పాడు. ఓ రోజు యశ్ కారు డ్రైవర్ అయిన రామచంద్రరాజును చూసిన నీల్ మైండ్‌లో ఏదో స్ట్రైక్ అయ్యిందట. ఈ సినిమాలో విలన్‌గా చేస్తావా ? అని అడగడంతో పాటు రఫ్ లుక్ కావాలి.. ముందు కాస్తంత గడ్డం పెంచు అన్నాడట. ఆ రోజుకు యశ్, రామచంద్రరాజు నవ్వుకున్నారట.
అసలు ఆ డ్రైవర్‌కు ఎప్పుడూ కెమేరా ముందు నటించిన అనుభవం కూడా లేదు. పైగా యశ్ దగ్గర 12 ఏళ్లుగా డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఓ వైపు గెడ్డం పెంచుతూనే మరో వైపు జిమ్‌కు వెళ్లి బాడీ బిల్డింగ్ అది స్టార్ట్ చేశాడు. ఎక్కడో చిన్న ఆశ.. ప్రశాంత్ నీల్ మాట ఇచ్చాడు కదా ? చిన్న పాత్రకు అయినా తీసుకోకపోతాడా ? అని అనుకునేవాడు. ఓ రోజు ప్రశాంత్ యశ్‌ను డైరెక్టుగా అడిగేశాడు. ఇక నీ బాడీ గార్డ్, నీ డ్రైవర్ నీకు ఉండడు అని చెప్పేశాడు.
యశ్ సరే అన్నాడు. కేజీయఫ్‌లో యశ్‌కు ధీటుగా బలమైన విలన్ పాత్ర కావాలి.. చివరకు అతడినే గరుడ పాత్రకు విలన్‌గా ఎంపిక చేసి యశ్‌కే షాక్ ఇచ్చాడు నీల్. అయితే రామ్‌కు నటనలో అనుభవం లేదు కదా ? అని యశ్ అన్నాడు. అవన్నీ నేను చేసుకుంటాను అన్నాడు ప్రశాంత్. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కన్నడలో మాత్రమే కాదు తెలుగు, తమిళం నుంచి కూడా విలన్‌గా చేయాలన్న ఆఫర్లు వస్తున్నాయి.
తెలుగులో కూడా మహాసముద్రం సినిమా చేశాడు. అది యశ్ కారు డ్రైవర్ కాస్తా ఇప్పుడు యశ్‌నే ఢీకొట్టే బలమైన విలన్గా మారిపోవడంతో పాటు యశ్‌తో సమానంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక్కడ యశ్ పాన్ ఇండియా క్రేజీ హీరో కావచ్చు. కానీ రామ్ కూడా ఓ పాన్ ఇండియా నటుడు అయితే అయ్యాడు కదా ?