Movies20 ఏళ్ల క్రిత‌మే చిరంజీవి సినిమా టిక్కెట్ రేటు = బంగారం...

20 ఏళ్ల క్రిత‌మే చిరంజీవి సినిమా టిక్కెట్ రేటు = బంగారం ఉంగరం.. ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్లు ఉన్నాయి. 151 సినిమాల్లో స‌క్సెస్‌లే ఎక్కువ‌. అయితే 20 ఏళ్ల క్రితం నాటి మాట ఇది. చిరంజీవి న‌టించిన మృగ‌రాజు 2001లో సంక్రాంతి కానుక‌గా భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. పైగా అదే సంక్రాంతికి బాల‌య్య న‌ర‌సింహానాయుడు వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత అదే యేడాది మేలో భ‌క్తిర‌స సినిమా శ్రీ మంజునాథ చేశారు. యావ‌రేజ్ అయినా పేరు రాలేదు.. క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. అదే యేడాది అక్టోబ‌ర్‌లో సురేష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ సినిమా డాడీ చేస్తే అది కూడా చిరు రేంజ్‌కు త‌గ్గ హిట్ కాలేదు.

దీంతో ఎలాగైనా ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడితే త‌ప్పా త‌న కెరీర్ పుంజుకోద‌ని చిరు క‌సితో ఉన్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ బి. గోపాల్ హీరోగా చిరుతో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. అలా ఎనౌన్స్ చేసిన వెంట‌నే ఈ సినిమా ఏదో సంచ‌ల‌నం రేపుతుంద‌న్న అంచ‌నాలు నాడు తెలుగు నాట వ‌చ్చేశాయి. పైగా అప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోన్న ఆర్తీ అగ‌ర్వాల్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాలిబింద్రే హీరోయిన్లు.

రిలీజ్‌కు ముందే పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. 2002 జూలై 24న రిలీజ్ అయిన ఇంద్ర సినిమాకు తొలిరోజే అదిరిపోయే టాక్ వ‌చ్చింది. తొలి ఆట నుంచే సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అన‌డంతో అస‌లు నెల రోజుల పాటు థియేట‌ర్లు పోటెత్తాయి. చివ‌ర‌కు బీ , సీ సెంట‌ర్ల‌లో కూడా ఈ సినిమా వారం రోజుల పాటు రోజుకు 24 గంట‌లు ఆడుతూనే ఉంది. అర్ధ‌రాత్రుళ్లు కూడా ప్రేక్ష‌కులు సినిమా కోసం థియేట‌ర్ల ద‌గ్గ‌ర పోటెత్త‌డంతో చివ‌ర‌కు థియేట‌ర్ యాజ‌మాన్యాలు 24 గంట‌ల పాటు 7-8 షోలు ర‌న్ చేశాయి.

ఇంద్ర ఆ రోజుల్లోనే రు. 18 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసి రు. 32 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. రు. 11 కోట్ల‌కు పైగా లాభాలు కొల్ల‌గొట్టింది. 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పుడు అదే ఇండ‌స్ట్రీ రికార్డ్‌. ఈ సినిమా టిక్కెట్లు అప్ప‌ట్లో బ్లాక్‌లో విప‌రీతంగా అమ్ముడు అయ్యాయి. ఆ రోజుల్లో టిక్కెట్ రు. 500 అంటే వామ్మో అనేవారు. అలాంటిది ఇంద్ర టిక్కెట్లు రు. 1500 నుంచి రు. 2 వేల వ‌ర‌కు అమ్ముడుపోయాయి.

మ‌ద‌న‌ప‌ల్లిలో ఐదు టిక్కెట్ల‌ను ఓ వ్య‌క్తి రు. 10 వేల‌కు కొన్నాడు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు బి. గోపాల్ ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా చెప్పారు. అలాగే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేట‌ర్లో ఓ బంగారం ఉంగ‌రం ఇచ్చి మ‌రో వ్య‌క్తి 4 టిక్కెట్ల‌ను కొన్నాడు. ఇది అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఇంద్ర టిక్కెట్ రేటు బంగారం ఉంగ‌రంతో స‌మానం అన్నది హైలెట్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news