ఇప్పుడు దేశవ్యాప్తంగా యశ్ పేరు మార్మోగిపోతోంది. మూడున్నరేళ్ల క్రితం యశ్ అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీకి తప్పా బయట వాళ్లకు పెద్దగా తెలియదు. కేజీయఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యశ్ నేషనల్ వైడ్‌గా పాన్ ఇండియా హీరో అయిపోవడతో పాటు రాకింగ్ స్టార్ అయిపోయాడు. ఇక నిన్న కేజీయఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయ్యాక అయితే యశ్ నిజమైన పాన్ ఇండియా హీరో అని సౌత్ టు నార్త్ కీర్తించేస్తున్నారు.
అసలు యశ్ సినిమా ఎంట్రీ ఎలా ? జరిగింది. యశ్ ఎలా ? ఎదిగాడు అతడి అసలు పేరేంటన్నది చూస్తే చాలా షాకింగ్ విషయాలే తాజాగా బయటకు వచ్చాయి. యశ్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగారు. కర్నాకటలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన యశ్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే సినిమాల్లో రాణించాలని 15 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి పారిపోయి నాటకాలు, స్టేజ్ షోలు.. టీవీ షోలు చేశాడు.
ఎట్టకేలకు యశ్ కోరిక నెరవేరింది. ముగ్గిన మనసులు అనే రొమాంటిక్ లవ్‌స్టోరీతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ రాధికా పండిట్‌ను తొలి చూపుల్లో చూసిన వెంటనే పడిపోయాడు. ఇంకేముందు ఆమెకు ప్రపోజ్ చేసి పడేశాడు. కాస్త తటపటాయించినా ఆమె ఓకే చెప్పేసింది. ఇంకేముంది పెళ్లి చేసుకుని ఎంచక్కా ఇద్దరు పిల్లలకు తండ్రైపోయాడు.
పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు దూరం అయ్యింది. భర్త, పిల్లలే జీవితంగా గృహిణి రోల్లోకి మారిపోయింది. ఇక తాను ఈ స్థాయికి రావడం వెనక ఎన్నో కష్టాలు పడ్డానని.. అవమానాలు ఎదుర్కొన్నానని.. సవాళ్లు స్వీకరించానని యశ్ ప్రమోషన్లలో చెపుతున్నాడు. ఇక యశ్ అసలు పేరు నవీన్‌కుమార్ గౌడ. ఇది మనోడి తల్లిదండ్రులు పెట్టిన పేరు.
అయితే యశ్ జన్మనక్షత్రం రీత్యా యతో పేరు పెట్టుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెప్పడంతో యశ్‌గా మార్చుకున్నాడు. ఈ పేరు పెట్టుకున్న వెంటనే యశ్ పట్టిందల్లా బంగారం అయిపోయింది. కేజీయఫ్ 1,2 సినిమాలో నేషనల్ వైడ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తమ హీరో యశ్ అని పేరు పెట్టుకుని యశస్సులో వెలిగిపోతున్నాడు అని మనోడి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.