స్టార్ హీరోలు కోట్లకి కోట్లు బడ్జెట్ పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీసినా అటు మహిళామణులు అందరికీ కూడా నచ్చేది… అందరూ మెచ్చేది మాత్రం కన్నీరు పెట్టించే సీరియల్స్. కుటుంబంలో ఉండే బాధ్యతలను బాధలను, ఎమోషన్స్ ని అన్నింటినీ కూడా చూపిస్తూ మహిళామణులను టీవీలకు కట్టిపడేస్తూ ఉంటాయి సీరియల్స్. ఇక ఇటీవల కాలంలో మహిళలు… పురుషులనే తేడా లేకుండా అందరూ సీరియల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు అనే చెప్పాలి.
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రేక్షకులు వారి అభిరుచికి తగ్గట్టుగా సీరియల్స్ ను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు కార్తీకదీపం సీరియల్ అయితే ఏళ్లకు ఏళ్లుగా బుల్లితెరపై ప్రసారం అవుతూ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్‌నే తోసిరాజనీ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటోంది. ఎన్నో సూపర్‌డూపర్ హిట్ సినిమాలు.. డ్యాన్స్ ప్రోగ్రాములు.. హీరోలు, హీరోయిన్ల ఇంటర్వ్యూలకే రాని టీఆర్పీ కార్తీకదీపం సొంతం అయ్యింది.
ఇప్పుడైతే పలు ఛానెల్స్‌లో చాలా సీరియల్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయ్. ఒకప్పుడు మాత్రం ఈ టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ మాత్రమే బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించినవి అంతరంగాలు – కళంకిత. ఇక ఈ సీరియల్ మొదలయ్యే ముందు ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వినిపించండి అంటే చాలు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మహిళామణులు వచ్చి టీవీల ముందు కూర్చునే వారు. సీరియల్లోని ఎమోషన్స్ అన్నింటినీ కూడా బాగా ఫీల్ అయిపోతు కన్నీరు పెట్టుకునేవారు.
ఇక ఈ రెండు సీరియల్స్‌లో ప్రధాన పాత్ర పోషించింది అశ్విని. పక్కింటి ఆడపిల్లలా ఉండే అశ్విని అంతరంగాలు, కళంకిత సీరియల్ ద్వారా ప్రతి తెలుగు ఇంటికి దగ్గర అయింది. ఆమె స్వతహాగా బెంగాలీ అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక అశ్విని అసలు పేరు రుద్ర. భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన పుడునెల్లు పొద్దునాట్టు అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ తర్వాత తమిళ – మలయాళ చిత్రాల్లో ఎక్కువగా నటించిన అశ్విని తెలుగులో జయసుధతో ఆంటీ చిరంజీవితో హిట్లర్ ఇక శ్రీహరితో కలిసి పోలీస్, గణపతి లాంటి సినిమాల్లో నటించింది. తర్వాత సీరియల్ లో నటించడం మొదలు పెట్టింది. బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా అంతరంగాలు – కళంకిత సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. కాని తర్వాత సింగపూర్ వెళ్లి అక్కడ నటిస్తూ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది అశ్విని.