Moviesఆ హీరోయిన్ల వాట్సాప్ మెసేజ్‌ల్లో అన్ని కమిట్‌మెంట్లే... ప‌డ‌క సుఖంపై ఎస్తేర్...

ఆ హీరోయిన్ల వాట్సాప్ మెసేజ్‌ల్లో అన్ని కమిట్‌మెంట్లే… ప‌డ‌క సుఖంపై ఎస్తేర్ బ్లాస్టింగ్ కామెంట్స్‌

టాలీవుడ్‌లోకి సునీల్ హీరోగా వ‌చ్చిన భీమ‌వ‌రం బుల్లోడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్‌. భీమ‌వ‌రం బుల్లోడు భారీ అంచ‌నాల‌తో వ‌చ్చినా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేదు. ఆ త‌ర్వాత వెయ్యి అబ‌ద్ధాలు అనే సినిమాలో కూడా ఆమె న‌టించింది. అయితే ఆ రెండు సినిమాలు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఎస్తేర్ ఇక్క‌డ క్లిక్ కాలేదు. తెలుగు ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఆమె ఆ త‌ర్వాత క‌న్న‌డ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ చేసింది.

ఆ త‌ర్వాత ఆమె జ‌య‌జాన‌కీ నాయ‌క‌, గ‌రం సినిమాల్లో కూడా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌ల్లో న‌టించింది. టాలెంట్ ఉన్నా కూడా అందం, స్ట్ర‌క్చ‌ర్‌ను బ‌ట్టి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఛాన్సులు ఇవ్వ‌ట్లేద‌ని కూడా ఆమె వాపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. తెలుగులో ర‌క‌ర‌కాల రూల్స్ ఉండ‌డంతో తాను క‌న్న‌డ ఇండ‌స్ట్రీ మీదే ఫోక‌స్ చేస్తున్నాన‌ని కూడా చాలా సార్లు చెప్పింది. ఎస్తేర్ ప్ర‌ముఖ రాప‌ర్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్ నోయ‌ల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

2019 జ‌న‌వ‌రిలో వీరి పెళ్లి అట్టహాసంగా జ‌రిగింది. అయితే 6 నెల‌ల‌కే వీరు విడాకులు తీసేసుకున్నారు. ఈ విడాకుల వ్య‌వ‌హారం అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఎస్తేర్ 69 సంస్కార్ కాలనీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ ప్ర‌మోష‌న్ల‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్య‌లు పెద్ద బ్లాస్ట్ అయిపోయాయి. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌న్న‌ది నిజం అని చెప్పిన ఆమె చాలా విష‌య‌లు బ‌య‌ట పెట్టింది.

త‌న‌కు సినిమాల్లో హీరోయిన్ ఛాన్సుల‌తో పాటు ప‌డ‌క సుఖం ఇస్తారా ? అన్న ఛాన్సులు కూడా వ‌చ్చేవ‌ని ఎస్తేర్ చెప్పింది. కొంద‌రు హీరోయిన్లు అయితే వీళ్ల‌ను ఇంప్రెస్ చేయి… వాళ్ల‌ను ఇంప్రెస్ చేయి అనే వాళ్లు.. అలా అనే హీరోయిన్ల‌ను కూడా తాను చూశాన‌ని.. వాళ్ల ఫోన్ల‌లో మెసేజ్‌లు కూడా త‌న‌కు చూపించి మ‌రీ త‌న‌ను ఛాన్సుల కోసం కొంద‌రిని ఇంప్రెస్ చేయ‌మ‌ని అడిగేవాళ్ల‌ని చెప్పింది. అలా చేసిన వాళ్ల‌లో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా కొంద‌రు ఉన్నార‌ని నోయ‌ల్ బాంబు పేల్చింది.

ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ప‌డ‌క సుఖం ఇవ్వ‌డం అనేది బాగా కొన‌సాగుతోంద‌ని.. అయితే తాను అలాంటి ప‌నులు చేయ‌న‌ని.. త‌న‌కు న‌చ్చిందే చేస్తాన‌ని ఎస్తుర్ చెప్పింది. ఆఫ‌ర్ల కోసం తాను క్యారెక్ట‌ర్‌ను కోల్పోన‌ని.. ఇలా నిక్క‌చ్చిగా ఉండ‌డం వ‌ల్లే తాను ఎన్నో ఆఫ‌ర్ల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని.. ఎంతోమంది నీ క‌న్నా చిన్న‌వాళ్లు పైకి వెళ్లిపోతున్నారు.. కొన్ని విష‌యాల్లో రాజీ ప‌డాల‌ని త‌న‌పై ఎంతో ప్రెజ‌ర్ చేశార‌ని కూడా ఆమె చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news