మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే టాలీవుడ్ మొత్తం మాయలో పడిపోతుంది. చిరు సినిమా అంటేనే ఓ మెస్మరైజ్. అలాంటిది చిరుతో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా అంటే ఇక బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంబోలాయే. వీరిద్దరు గతంలో మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో కొద్ది సేపు మాత్రమే కలిసి నటించారు. అయితే ఇప్పుడు ఫుల్ లెన్త్ పాత్రల్లో కలిసి నటిస్తున్నారు. తండ్రి, కొడుకులు కలిసి ఒకే సినిమాలో నటిస్తుండడంతో తెలుగు సినిమా అభిమానుల్లో కూడా ఎంతో క్యూరియాసిటీ అయితే ఉంది.
మూడేళ్ల నుంచి ఊరిస్తూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో చిరు నక్సలైట్‌గా కనిపిస్తున్నాడు. రామ్‌చరణ్ ధర్మస్థలిలో ధర్మం కాపాడే యువకుడి పాత్రలో కనిపిస్తాడు. చిరుకు జోడీగా కాజల్ నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరిగినా.. ఆమె తప్పించామని దర్శకుడు కొరటాల శివ ట్విస్ట్ ఇచ్చారు.
ఇక చెర్రీకి జోడీగా పూజా హెగ్డే మాత్రమే నటిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు మరో నాలుగు రోజుల టైం మాత్రమే ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆచార్య
U/A సర్టిఫికెట్ ను పొందింది. సెన్సార్ తర్వాత రన్ టైం పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఆచార్య రన్ టైం మొత్తం 154 నిమిషాలుగా ఉన్నట్టు చెపుతున్నారు.
154 నిమిషాలు అంటే రెండున్నర గంటల మీద నాలుగు నిమిషాలు మాత్రమే ఎక్కువుగా ఉంటుంది. ఇది క్రిస్పీ రన్ టైం అని చెప్పాలి. ఇక ఇద్దరు హీరోల పాత్రలు కీలకంగా ఉన్నా ఎడిటింగ్ విషయంలో బాగా ట్రిమ్ చేశారనే అంటున్నారు. సినిమా ఫస్టాఫ్ అంతా ధర్మస్థలి నేపథ్యంలోనూ.. సెకండాఫ్ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లోనూ నడుస్తుందని అంటున్నారు.
చివర్లో క్లైమాక్స్‌కు ముందు నుంచి మళ్లీ ధర్మస్థలికి మారుతుందని.. ధర్మస్థలి దగ్గరే ఆచార్య క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. సినిమా కథ, కథనాల పరంగా మనం ఎప్పుడూ చూడని జోనర్‌లో ఉంటుందని చెపుతున్నారు. ఏదేమైనా సెన్సార్ తర్వాత ఆచార్యకు పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.