మెగాస్టార్ ఆచార్య సినిమా మూడేళ్ల పాటు ఊరించి ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అయ్యింది. నైజాం ఏరియాలో మెగా హీరోల సినిమాలకు అభిమానులు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఇక్కడ మెగా హీరోల సినిమాలకు మంచి టాక్ వస్తే సులువుగానే రు. 20 కోట్ల వసూళ్లు క్రాస్ అవుతున్నాయి. చివరకు ఫిదా లాంటి సినిమాలకు కూడా ఇక్కడ రు. 20 కోట్ల రేంజ్ వసూల్లు వచ్చాయంటేనే మెగాభిమానుల సందడి ఎలా ? ఉంటుందో తెలుస్తోంది.
మెగాభిమానుల సినిమాలు అడ్వాన్స్ బుకింగ్‌ల విషయంలో మాత్రమే కాదు.. ఇటు ప్రీ బుకింగ్స్‌లో కూడా దుమ్ము లేపేస్తూ ఉంటాయి. రికార్డులు బ్రేక్ చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా వచ్చిన ఆచార్య సినిమా ఎందుకో గాని నైజాంలో ఫూర్ బజ్‌తో స్టార్ట్ అయ్యింది. ఆ మాటకు వస్తే ఒక్క నైజాంలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్‌గా చిరంజీవి రేంజ్‌లో ఉండాల్సిన బజ్, అంచనాలు అయితే ముందు నుంచే ఆచార్యపై లేవు.
తెలంగాణలో ఆచార్య సినిమాను ఫస్ట్ డే 649 షోలు వేస్తున్నారు. పైగా టిక్కెట్ రేట్లు కూడా పెంచారు. మల్టీఫ్లెక్స్‌ల్లో 500 – 410 – 354 గా టిక్కెట్ రేట్లు ఉంటే.. సింగిల్ స్క్రీన్లలో 210 – 150 – 90గా ఉంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే నైజాంలో రు 5.9 కోట్లు రాబట్టింది. ఒక్క హైదరాబాద్‌లోనే రు 4.27 కోట్లు వచ్చాయి. అయితే ఇక్కడ రైట్స్‌ను వరంగల్ శ్రీను రు. 42 కోట్లకు కొన్నారు.
ఆచార్యకు ఇప్పుడున్న ప్రీ బుకింగ్స్ చూస్తే అప్‌సెట్ గానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. సినిమా చాలా సార్లు లేట్ అవ్వడం.. రిలీజ్ డేట్లు వాయిదాలు పడడం.. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల ముందు ఆచార్య చిన్నగా అనిపించడం.. ఆ రెండు సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికే భారీగా ఖర్చు చేసి ఉండడంతో ఆచార్యను త్వరగా చూసేయాలన్న ఆతృత వారిలో కానరావడం లేదు.
నైజాంలో మొత్తం 420 థియేటర్లు ఉంటే ఆచార్యకే 355 ఇచ్చారు. సీడెడ్‌లో 260 థియేటర్లు, ఆంధ్రాలో 520 థియేటర్లలో ఆచార్య రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్‌లో 650 థియేటర్లలో సినిమాను వేస్తున్నారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 2000 లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఏపీ, సీడెడ్‌లో ఉన్న ఓ మోస్తరు బజ్ కూడా తెలంగాణలో లేకపోవడం ఇప్పుడు అందరిని డిజప్పాయింట్ చేసింది.
త్రిబుల్ ఆర్, భీమ్లానాయక్, కేజీయఫ్ 2 సినిమాల హైప్‌తో పోలిస్తే ఆచార్యకు వచ్చిన బజ్ సగం కూడా లేదంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఈ యేడాదిలోనే చిరు రెండు రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళం రీమేక్ భోళా శంకర్ ( ఈ యేడాది లేకుండా వచ్చే యేడాది ఆరంభంలో) మరి ఈ సినిమాలతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారన్న సందేహాలు కూడా మెగాభిమానుల్లోనే కలుగుతున్నాయ్.!