Moviesరీల్ లైఫ్‌లో ప్రేమించిన హీరోలనే రియల్‌గా పెళ్లాడిన హీరో, హీరోయిన్లు...

రీల్ లైఫ్‌లో ప్రేమించిన హీరోలనే రియల్‌గా పెళ్లాడిన హీరో, హీరోయిన్లు వీళ్లే..!

పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అన్న ఒక సామెత అయితే ఎప్పటినుంచో ఉంది. పెళ్లి అనేది జీవితంలో ఎవరికీ అయినా ఒక ముఖ్యమైన ఘట్టం. మన జీవితంలో పుట్టుక.. చావు.. పెళ్ళి అనేవి ఎంతో కీలకం.పెళ్లి అనే బంధంతో మనం ఓ సరికొత్త జీవితంలోకి ఎంటర్ అవుతాము . అయితే మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అయిపోయాయి . ఈ కాలంలో పెళ్లి అంటే ప్రేమ పెళ్లి అన్నది కామన్ అయిపోయింది. ప్రస్తుతం సినిమా రంగం అనేది గ్లామర్ ఫీల్డ్. ఈ రంగంలో ఎక్కువమంది ప్రేమ, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీల్ లైఫ్ లో సినిమాల్లో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు రియల్ లైఫ్‌లోనూ ప్రేమలోపడి పెళ్ళి చేసుకున్నారు. అలాంటి 5 జంటల గురించి తెలుసుకుందాం.

1- సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల :
టాలీవుడ్‌లో సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల దాంపత్య జీవితం ఎంతో మందికి ఆదర్శం. ప్రేమకు.. పెళ్లి అనేది ఏ మాత్రం అడ్డంకి కాదని వీరిద్దరూ నిరూపించారు. విచిత్రమేంటంటే వీరిద్దరూ ప్రేమలో పడే నాటికి.. వీరికి అప్పటికే వేరే వ్య‌క్తుల‌తో పెళ్ళి అయిపోయింది సూపర్ స్టార్ కృష్ణకు తన మరదలు ఇందిరతో పెళ్లి అయ్యి పిల్లలు కూడా పుట్టారు. విజయనిర్మల అప్ప‌టికే నటిగా, ద‌ర్శ‌కురాలిగా పాపుల‌ర్‌. ఆమెకు అప్ప‌టికే పెళ్లి అవ్వడంతోపాటు కొడుకు నరేష్ పుట్టాడు. త‌న భ‌ర్త‌తో గ్యాప్‌తో విడాకులు తీసుకున్నారు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట సినిమాల పరంగా ఎన్నో సార్లు ప్రేమలో పడ్డారు . ఆ ప్రేమ నిజజీవితంలోనూ పుట్టుకువచ్చింది. దీంతో అప్పటికే తనకు భార్య ఉన్నా కూడా విజయనిర్మల – కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు. విజయనిర్మల చనిపోయే వరకు కూడా కృష్ణ‌తోనే ఉన్నారు.

2- శ్రీకాంత్ ,ఊహ :
సీనియర్ నటుడు శ్రీకాంత్ ఒకనాటి హీరోయిన్ ఊహ ఇద్దరూ కూడా కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వీరు సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లింది. శ్రీకాంత్ త‌న ఇంట్లో జ‌రిగే ఫంక్ష‌న్లు అన్నింటికి ఊహాను ఆహ్వానించేవారు. ఒకానొక టైంలో వీరి పెళ్లికి శ్రీకాంత్ ఇంట్లో ఒప్పుకోర‌న్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగడంతో శ్రీకాంత్ పెళ్లికి శుభం కార్డు పడింది. 1997లో శ్రీకాంత్ – ఊహ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. శ్రీకాంత్, ఊహ దంపతుల పెద్ద కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

3- రాజశేఖర్, జీవిత :
సీనియర్ నటుడు రాజశేఖర్.. సీనియర్ హీరోయిన్ జీవిత దంపతులు కలిసి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అంకుశం, ఆహుతి సూపర్ హిట్ అయ్యాయి. తెరమీద ప్రేమికులు, భార్యాభర్తలుగా నటించిన జీవిత – రాజశేఖర్ నిజంగానే ప్రేమలో పడ్డారు. 1991లో వీరికి పెళ్లి జరిగింది. జీవిత రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక‌ ఉన్నారు. వీరు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.

4- మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ :
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాజీ మిస్ ఇండియా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ తో కలిసి 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో నటించాడు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా నిజ జీవితంలో మాత్రం మహేష్ బాబు – నమ్రత ప్రేమ సక్సెస్ కొట్టింది. 2005లో సీక్రెట్ గా ముంబైలో పెళ్లి చేసుకున్న‌ ఈ దంపతులకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు.

5- నాగ చైతన్య, సమంత :
రీల్ లైఫ్ లో ప్రేమలో పడి రీయ‌ల్ లైఫ్ లో ప్రేమికులు అయిన మరో జంట నాగచైతన్య – సమంత. స‌మంత తొలి సినిమా ఏ మాయ చేసావే సినిమాతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ సినిమా మ‌నంలో కలిసి నటిస్తున్న సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అలాగే ఆటోనగర్ సూర్య , మజిలీ సినిమాలు కూడా చైతు, సమంత కాంబినేషన్లో వచ్చాయి. నాలుగేళ్లపాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులు మనస్పర్థలతో గత ఏడాది విడాకులు తీసుకున్నారు.

6- అజిత్, షాలిని :
తెలుగు వాడు అయినా కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో అడుగుపెట్టిన షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఈ దంపతులకు పెళ్లి జరగగా ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

7- సూర్య, జోతిక :
కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య – జ్యోతిక‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పట్లో సూర్య కంటే జ్యోతిక టాప్ హీరోయిన్ గా ఉండేది. సౌత్ ఇండియన్ జ్యోతిక ఏలేసింది. 2006లో వీరి పెళ్లి జరగదు ఒక పాప, బాబు ఉన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news